జీహెచ్ఆర్ ఇన్ఫ్రా సంస్థ జీహెచ్ఆర్ కాలిస్టో అనే ప్రాజెక్టును ప్రారంభించింది. కొల్లూరులో సుమారు 8.3 ఎకరాల్లో అభివృద్ధి చేసే ఈ ప్రాజెక్టులో దాదాపు నాలుగు హైరైజ్ టవర్లను నిర్మిస్తారు. సుమారు వచ్చే ఫ్లాట్ల సంఖ్య సుమారు 1190 దాకా ఉంటాయి. రెరా అనుమతి లభించిన ఈ ప్రాజెక్టును 2025 డిసెంబరులో కొనుగోలుదారులకు అప్పగిస్తామని సంస్థ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించింది. ఈ సందర్భంగా సంస్థ మేనేజింగ్ పార్ట్నర్ వి. శ్యాంసుందర్‌రెడ్డి మాట్లాడుతూ.. నగరవాసుల అవసరాలకు సరిపడే విధంగా ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.
ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ మరియు బీఐఎం సేవలను జీహెచ్ఆర్ కాలిస్టో కోసం టాటాప్రాజెక్ట్స్ అందిస్తోందని చెప్పారు. ‘‘కొల్లూర్‌లో ప్రీమియం అపార్ట్మెంట్ కమ్యూనిటీ జీహెచ్ఆర్ కాలిస్టో నిర్మిస్తుండటం పట్ల చాలా సంతోషంగా ఉన్నాం. హైదరాబాద్‌లోని నూతన తరపు స్మార్ట్ హోమ్ కొనుగోలుదారులకు అత్యుత్తమ స్మార్ట్ హోమ్ అవకాశాలను అందిస్తుంద’’ ని సంస్థ సీఈవో కార్తీష్ రెడ్డి మడ్గుల తెలిపారు.