-
- శంషాబాద్ ఎయిర్‌పోర్టు పక్కనే
-
- బ్యూటీఫుల్ ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్
- ఆహ్లాదకరమైన పరిసరాలు..
- 7.5 ఎకరాల్లో 9 హోల్ గోల్ఫ్ కోర్సు
- నచ్చినట్టుగా ఇల్లు కట్టుకునే సౌలభ్యం
- 200 గజాల్నుంచి ప్లాట్లు లభ్యం
సొంతింటి గురించి చాలామందికి రకరకాల ఆలోచనలు.. విభిన్న అభిరుచులుంటాయి. కాకపోతే, అన్నివిధాల అభివృద్ధి చెందిన ప్రాంతంలో స్థలం దొరకడం కష్టమవుతున్న ప్రస్తుత తరుణంలో.. నచ్చినట్టుగా ఇల్లు కట్టుకోవడం సాధ్యమయ్యే పనేనా? అందుకే.. కొందరేం చేస్తారంటే ఏదో ఒక గేటెడ్ కమ్యూనిటీలో విల్లా కొనుక్కుని రాజీపడతారు. కానీ, ఇక నుంచి రాజీపడే అవకాశమే లేకుండా.. కలల గృహాన్ని నచ్చినట్టుగా కట్టుకునే సరికొత్త అవకాశం మన ముంగిట్లోకి వచ్చేసింది.
వర్టెక్స్ కేఎల్ఆర్.. ప్రజల మనసెరిగి ప్రాజెక్టుల్ని డిజైన్ చేసే సంస్థ. కొనుగోలుదారులకేం కావాలో ముందే పక్కాగా అంచనా వేసి ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తుంది. శంషాబాద్ విమానాశ్రయం చేరువలో ఒక మంచి ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ కడితే ప్రజలకెంతో ఉపయోగపడుతుందని అంచనా వేసిన వర్టెక్స్ కేఎల్ఆర్.. విమానాశ్రయం చేరువలోని తుక్కుగూడలో..ప్రత్యేకంగా గిగా సిటీ అనే ఓ ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్పునకు శ్రీకారం చుట్టింది. యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి ఆధునిక పట్టణం మరెక్కగా ఆవిష్కృతం కాలేదంటే నమ్మండి. అసలు టౌన్ షిప్ అనే పదం నిర్వచనాన్ని పూర్తిగా మార్చివేసింది.. వర్టెక్స్ హోమ్స్.
200 గజాల్నుంచి..
ప్రకృతిలో సేదతీరేందుకు ఉపయోగపడే విధంగా గిగా సిటీని ఓ ఇంటీగ్రేటెడ్ టౌన్‌షిప్ లా ఆకర్షణీయంగా వర్టెక్స్ కేఎల్ఆర్ తీర్చిదిద్దింది. ప్రతిఒక్కరూ హాయిగొలిపేలా నివసించేందుకు అవసరమయ్యే మౌలిక సదుపాయాల్ని ఇందులో మెరుగుపరిచారు. ప్రతి అంగుళం, ప్రతి వీధి మరియు ప్రతి మూలను ఆలోచనాత్మకంగా రూపొందించారు. గిగా సిటీలో ప్లాటు కొనుక్కుంటే చాలు.. తమకు నచ్చిన గృహంలో నివసించడమే కాదు.. ఇక్కడి మౌలిక సదుపాయాల్ని ఆస్వాదించొచ్చు. ఇందులో 200, 300, 400, 500, 555 గజాల్లో ప్లాట్లు లభిస్తాయి. కావాలంటే, ఇందులో 1200 గజాల ప్లాట్లూ లభిస్తాయి. నివసించడానికి అవసరమయ్యే సమస్త సదుపాయాల్ని పొందుపరిచారు. ఎవరైనా ఇందులో ప్లాటు కొనుక్కుని తమకు నచ్చినట్లుగా ఇల్లు కట్టుకుంటే సరిపోతుంది.
సులువుగా రాకపోకలు..
వర్టెక్స్ కేఎల్ఆర్ గిగా సిటీలో ప్లాటు కొనుక్కుంటే ఎంచక్కా తీరిక వేళల్లో గోల్ఫ్ ను ఆస్వాదించొచ్చు. సుమారు 7.5 ఎకరాల్లో నైన్ హోల్స్ గోల్ఫ్ కోర్సును తీర్చిదిద్దింది. ప్రత్యేకంగా క్రికెట్ ప్రాక్టీస్ స్టేడియంకు రూపకల్పన చేశారు. దీంతో నచ్చినవారితో క్రికెట్ ఆడుకోవచ్చు. ఇందులో విశాలమైన రహదారులు, పార్కులు, ఖాళీ స్థలాలు, చిల్డ్రన్ ప్లే జోన్ వంటివి ప్రతిఒక్కర్ని ఇట్టే ఆకర్షిస్తాయి. దీన్ని ఎంత అద్భుతంగా ప్లాన్ చేశారంటే.. 100, 120, 150 అడుగుల రహదారుల నుంచి ఔటర్ రింగ్ రోడ్డు, శ్రీశైలం రోడ్డులకు సులువుగా రాకపోకల్ని సాగించొచ్చు. ఇక్కడ్నుంచి రాజీవ్ గాంధీ విమానాశ్రయానికి సులువుగా చేరుకోవచ్చు. ఫ్యాబ్ సిటీ, వండర్‌లా, ఫార్మా సిటీ, ఆగాఖాన్ అకాడమీ వంటి వాటికి సులువుగా వెళ్లొచ్చు. ఇప్పటికే 80 శాతం అభివృద్ధి పనుల్ని పూర్తి చేసుకున్న ఈ ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తోంది. ఇందులో మీకు నచ్చిన ప్లాటును ఎంచుకుని.. మీ డ్రీమ్ హోమ్‌ను ఎంచక్కా కట్టుకోండి.
హెచ్ఎండీఏ చూడాల్సిందే..
-
- హెచ్ఎండీఏ ప్రణాళికలు రచిస్తున్న శాటిలైట్ టౌన్ షిప్పులు కచ్చితంగా ఒక్కసారి అయినా ఈ గిగా సిటీని ప్రత్యక్షంగా గమనించాల్సిందే.
- మీ రోజువారీ ప్రయాణ భారాన్ని పెంచకుండా.. అదే సమయంలో మీ కలల గృహంలో నివసించే అరుదైన అవకాశాన్ని మీకు గిగా సిటీ అందిస్తోంది. ఇక్కడ్నుంచి గచ్చిబౌలి మరియు ఫైనాన్షియల్ డిస్ట్రిక్టులకు మహా అయితే ఓ పాతిక నిమిషాల్లో చేరుకోవచ్చు.