గణేశ్ ఉత్సవాల భద్రత విషయంలో ప్రముఖ కంపెనీ గోద్రేజ్ అనుబంధ కంపెనీ గోద్రేజ్ అండ్ బాయ్స్ కి చెందిన గోద్రేజ్ సెక్యూరిటీ సెల్యూషన్స్ (జీఎస్ఎస్) కీలక పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా ముంబైలో గణేశ్ మండపాలకు తగినంత భద్రత కల్పిస్తోంది. ప్రముఖ మండపాల వద్ద సీసీటీవీ కెమెరాలతోపాటు డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లు, చేతితో వినియోగించే మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేసింది. లాల్ బాగ్చా రాజా, ముంబయిచా రాజా, గణేశ్ గల్లి, చింతామణి సహా పలు మండళ్లలో ఈ మేరకు భద్రతా చర్యలు తీసుకుంది.
భద్రత విషయంలో భారతీయులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలుసుకునేందుకు జీఎస్ఎస్ ఇటీవల ‘డీ కోడింగ్ సేఫ్ అండ్ సౌండ్: ఇన్ ది ఇండియన్ కాంటెక్ట్స్’ పేరుతో ఓ అధ్యయనం చేసింది. ఇందులో వెల్లడైన అంశాల మేరకు గణేశ్ చతుర్ధి వేడుకలను సేఫ్ అండ్ సౌండ్ గా నిర్వహించాలని భావించి, ఈ మేరకు చర్యలు చేపట్టింది. ‘దేశవ్యాప్తంగా గణేశ్ చతుర్థి వేడుకలను ఘనంగా జరుపుకొంటారు. ఈ నేపథ్యంలో ముంబైలో ఈ వేడుకలను మరింత ఉత్సాహంగా జరుపుకొనేందుకు వీలుగా గణేశ్ మండళ్ల వద్ద సీసీటీవీ కెమెరాలు, మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేస్తున్నాం’ అని జీఎస్ఎస్ బిజినెస్ హెడ్ పుష్కర్ గోఖలే వెల్లడించారు.