సూరజ్ ఎస్టేట్ డెవలపర్స్ ఐపీఓ దుమ్ము రేపింది. 15 రెట్లు ఎక్కువగా షేర్లు అమ్ముడయ్యాయి. ఐపీఓ ముగింపు రోజైన బుధవారం నాటికి మొత్తం 12,88,46,559 బిడ్లు దాఖలయ్యాయి. రూ.340- 360 ధర మధ్య 82,35,293 షేర్లతో ఐపీఓకు రాగా, 15.65 రెట్లు ఎక్కువ బిడ్లు వచ్చాయి. ముంబైకి చెందిన సూరజ్ ఎస్టేట్ డెవలపర్స్ రూ.400 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంతో ఐపీఓకి వచ్చింది.