అక్రమంగా లేఅవుట్ లు వేసి విక్రయాలు చేస్తున్న డెవలపర్లకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. హెచ్ఎండీఏ, డీటీసీపీ అనుమతి లేని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయొద్దని రిజిస్ట్రేషన్ల శాఖను ఆదేశించింది. గతంలో పలువురు డెవలపర్లు గ్రామపంచాయతీల అనుమతితో లే అవుట్లు వేసి ప్లాట్ల విక్రయాలు జరిపారు. అయితే అవన్నీ అక్రమమని తేల్చిన సర్కారు వాటిని క్రమబద్ధీకరించుకునేందుకు ఎల్ఆర్ఎస్ పథకాన్ని తీసుకొచ్చింది.
అనుమతి లేని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయొద్దని ఆదేశించింది. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో అప్పటికే కొనుగోలు చేసిన ప్లాట్ల రిజిస్ట్రేషన్ కు అంగీకరించింది. అయితే, అప్పటివరకు అమ్ముడుకాని ప్లాట్లకు మాత్రం అనుమతి తీసుకోవాలని స్పష్టంచేసింది. దీనిపై హైకోర్టులో డెవలపర్లకు అనుకూలంగా తీర్పు రాగా, ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ నేపథ్యంలో అనుమతి లేని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయొద్దని తాజాగా సర్కారు ఆదేశించింది.
This website uses cookies.