Categories: LEGAL

వారి డబ్బులు వెనక్కి ఇచ్చేయండి

    • ఏలియన్స్ డెవలపర్స్ కి ఎస్సీడీఆర్సీ ఆదేశం
  • గడువులోగా ఇల్లు అప్పగించకపోవడమే కారణం

డబ్బులు తీసుకున్న తర్వాత నిర్దేశిత గడువులోగా ఫ్లాట్ అప్పగించని కారణంగా ఏలియన్స్ డెవలపర్స్ పై తెలంగాణ రాష్ట్ర వివాదాల పరిష్కార కమిషన్ (ఎస్సీడీఆర్సీ) కన్నెర్రజేసింది. వెంటనే ఆ పది మంది డబ్బు వెనక్కి ఇచ్చేయాలని ఆదేశించింది. అంతేకాకుండా ఇన్నాళ్లూ వారు అనుభవించిన మానసిక క్షోభ కారణంగా ఒక్కొక్కరికీ మరో రూ.50వేలు చెల్లించాలని స్పస్టంచేసింది. ఏలియన్స్ డెవలపర్స్ చేపట్టిన ప్రాజెక్టులో హరినాథ్ అప్పానీ అనే వ్యక్తి 2150 చదరపు అడుగుల ఫ్లాట్ ఒకటి కొనుగోలు చేశారు.

ఇందుకోసం 2008లో రూ.20 లక్షలు చెల్లించారు. 2010 మార్చినాటికి ప్రాజెక్టు పూర్తి చేస్తామని, లేనిపక్షంలో చదరపు అడుగుకు రూ.3 పరిహారం చెల్లిస్తామని సంస్థ ఒప్పందం చేసుకుంది. కానీ గడువులోగా ఫ్లాట్ అప్పగించకపోవడంతో హరినాథ్ తదితరులు కమిషన్ ను ఆశ్రయించారు. అయితే, ఫిర్యాదుదారు తన డబ్బులు వెనక్కి ఇవ్వాలని ఎప్పుడూ అడగలేదని.. పైగా ఈఎంఐలు కూడా చెల్లించలేదని పేర్కొంది.

ఫైర్ సర్వీస్, ఇతర ఏజెన్సీల నుంచి అనుమతులు రావడంలో ఆలస్యం కావడంల వల్లే ప్రాజెక్టు ఆలస్యమైందని వివరణ ఇచ్చింది. ఈ వివరణపై కమిషన్ అభ్యంతరం వ్యక్తంచేసింది. ఫ్లాట్ యజమానుల నుంచి డబ్బులు వసూలు చేయడానికి ముందే ఈ అనుమతులన్నీ తెచ్చుకోవాలని తెలియదా అని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో వారి డబ్బులు వెనక్కి ఇవ్వాలని ఆదేశించింది.

This website uses cookies.