Categories: TOP STORIES

అంద‌రూ మెచ్చే ఆనంద నిల‌యం.. గ్రాండ్ లాంచ్ రేపే..

  • సౌతిండియాలోనే అతిపెద్ద
    క‌మ్యూనిటీ ఎల్‌బీ న‌గ‌ర్‌లో!
  • విస్తీర్ణం: 29.37 ఎకరాలు
  • 33 అంత‌స్తులు.. 3,576 ఫ్లాట్లు
  • రెండు క్ల‌బ్ హౌజులు.. వాటి
  • ఆధునిక స‌దుపాయాల‌కు పెద్ద‌పీట‌

ఆకాశ‌హ‌ర్మ్యాల‌తో బిలియ‌న‌ర్ల‌ను ఆక‌ర్షిస్తున్న హైద‌రాబాద్ నిర్మాణ రంగం స‌రికొత్త రికార్డును నెల‌కొల్పింది. ద‌క్షిణ భార‌త‌దేశంలోనే అతిపెద్ద హైరైజ్ గేటెడ్ క‌మ్యూనిటీకి ఎల్‌బీ న‌గ‌ర్ వేదిక‌గా మారుతోంది. న‌గ‌రానికి చెందిన వాస‌వి గ్రూప్ నుంచి జాలువారుతోన్న ఈ అత్యుత్త‌మ స్కై స్క్రేప‌ర్ గేటెడ్ క‌మ్యూనిటీ.. ఈస్ట్ హైద‌రాబాద్‌కే ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా మారుతోంది. త‌మ కొనుగోలుదారులు ప్ర‌తిక్ష‌ణాన్ని అతిమ‌ధురం చేసుకోవ‌డమే కాకుండా.. ఆనంద సంబ‌రాల్లో మునిగితేలాల‌న్న ఓ బృహ‌త్ ల‌క్ష్యంతో.. వాస‌వి గ్రూప్‌.. ‘ఆనంద నిలయం’కు శ్రీకారం చుట్టింది. రేపే అట్టహాసంగా ఆరంభం కానున్న ఈ ప్రాజెక్టుపై రియ‌ల్ ఎస్టేట్ గురు అందిస్తోన్న ప్ర‌త్యేక క‌థ‌నం మీకోసం..

హైద‌రాబాద్‌లో ఆధునిక గేటెడ్ క‌మ్యూనిటీల్లో అత్యాధునిక స‌దుపాయాల్ని ప్ర‌వేశ‌పెడుతున్న సంస్థ‌ల్లో వాస‌వి గ్రూప్ ముందంజ‌లో ఉంటుంది. న‌గ‌రం న‌లువైపులా ప్రాజెక్టుల‌ను చేప‌డుతున్న సంస్థ‌గా.. కొనుగోలుదారుల మ‌న్న‌న‌ల‌ను పొందుతున్న ఈ సంస్థ‌.. ద‌క్షిణ భార‌త‌దేశంలోనే అతిపెద్ద హైరైజ్ గేటెడ్ క‌మ్యూనిటీకి శ్రీకారం చుట్టింది. దీనికి ‘‘ఆనంద నిల‌యం’’ అని పేరు పెట్టింది. దాదాపు 29.37 ఎకరాల విస్తీర్ణంలో.. సుమారు 33 అంతస్తుల ఎత్తులో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో మొత్తం పదకొండు టవర్లను నిర్మిస్తారు.

ఇందులో మొత్తం వచ్చే ఫ్లాట్ల సంఖ్య.. దాదాపు 3,576 దాకా ఉంటాయి. ఇంత బడా ప్రాజెక్టులో ఒక క్లబ్ హౌజ్ నివాసితులకు సరిపోదనే ఉద్దేశ్యంతో.. రెండు క్లబ్ హౌజులకు స్థానం కల్పించింది. సుమారు 1.31 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అభివృద్ధి చేస్తోంది. 2, 3, 4 ప‌డ‌క గదుల‌కు పెద్ద పీట వేసిన ఈ ప్రాజెక్టులో.. సుమారు 112 స్కై విల్లాల‌ను తీర్చిదిద్దింది. దాదాపు ముప్ప‌య్ ఎక‌రాల విస్తీర్ణంలో డిజైన్ చేసిన ఆనంద నిల‌యంలో నిర్మాణం వ‌చ్చేది కేవ‌లం 28 శాతం స్థ‌లంలోనే. మిగ‌తా 72 శాతాన్ని ఓపెన్ స్పేస్‌గా వ‌దిలేశారు.

ప్ర‌త్యేక కాన్సెప్టు

వాస‌వి సంస్థ విశిష్ఠ‌త ఏమిటంటే.. కాన్సెప్టు ఓరియెంటెడ్ గా ఈ ఆకాశ‌హ‌ర్మ్యాన్ని తీర్చిదిద్దింది. మొత్తం ప్రాజెక్టులో తివాచీ ప‌ర్చిన‌ట్లుగా ప‌చ్చ‌ద‌నం ద‌ర్శ‌న‌మిస్తుంది. ల్యాండ్ స్కేపింగ్ కోస‌మే ప్ర‌త్యేకంగా ఒక కాన్సెప్టుకు శ్రీకారం చుట్టింది. ప్రాజెక్టులోని ప్ర‌వేశమార్గం ప్ర‌తిఒక్క‌రినీ ఆకట్టుకునేలా క‌నిపిస్తుంది. డిజైనింగ్‌లో వాస‌వి సంస్థ రాజీప‌డ‌లేద‌ని చెప్ప‌డానికిదే నిద‌ర్శ‌న‌మని చెప్పొచ్చు. ప్ర‌వేశ‌మార్గంలోనే ఒక ప్ర‌త్యేక ఫౌంటెయిన్‌ను పెట్ట‌డం వ‌ల్ల సాయంత్రం కాగానే పెద్ద‌లు, మ‌హిళ‌లు క‌లిసిక‌ట్టుగా కూర్చోని క‌బుర్లు చెప్ప‌కుంటూ సేద‌తీరే వీలు క‌లుగుతుంది. ఎవెన్యూ రోడ్లు కానీయండి.. ప్రాజెక్టులోకి ప్ర‌వేశించే మార్గం వంటివాటిని ప్ర‌త్యేకంగా డిజైన్ చేసింది.

  • ఇందులో నివ‌సించే చిన్నారులు, యువ‌త‌, పెద్ద‌లు.. ఇలా ప్ర‌తిఒక్క‌రూ సంతోషంగా నివ‌సించేందుకు అనేక అమెటీస్‌ను వాస‌వి సంస్థ పొందుప‌ర్చింది. చిన్నారుల‌కు టాట్ లాట్లు, సాండ్ పిట్‌, చిల్డ్ర‌న్స్ ప్లే ఏరియాలు, డే కేర్ క్రెష్‌, ఈపీడీఎం కోర్టులు- హాప్ స్కాచ్‌, ఔట్‌డోర్ గేములు, కిడ్స్ పూల్‌, బైసికిల్ ట్రాక్‌, మ‌ల్టీప‌ర్ప‌స్ ప్లే ఏరియా, స్కూల్ బ‌స్ పిక‌ప్ మ‌రియు డ్రాఫ్ స‌దుపాయం వంటివి క‌ల్పించింది.
  • యువ‌త కోసం జాగింగ్ ట్రాక్‌, బ్యాడ్మింటన్ కోర్టు, హాఫ్ బాస్కెట్ బాల్ కోర్టు, నెట్ క్రికెట్ పిచ్, స్కేటింగ్ రింక్, టెన్నిస్ కోర్టు, చెస్ గార్డెన్, సాండ్ వాలీబాల్ కోర్టు, ఔట్ డోర్ జిమ్ వంటివి ఏర్పాటు చేస్తారు. స్టెప్డ్ వాటర్ బాడీ మరియు ఫౌంటెయిన్లు, రెండు పార్టీ లాన్లు, గజిబో, బాంబూ గ్రోవ్ మరియు నీటికొలను, ట్రెల్లీస్, పర్గోలా స్ట్రక్చర్, ఔట్‌డోర్ వర్కింగ్ జోన్లు, బార్‌బీక్యూ పెవీలియ‌న్‌, మ‌ల్టీప‌ర్ప‌స్ లాన్ వంటి వాటికి స్థానం క‌ల్పిస్తారు.
  • హెర్బ్ గార్డెన్, మెడిటేష‌న్ పెవిలియ‌న్‌, రిఫ్లెక్సాల‌జీ పార్క్‌, హీలింగ్ గార్డెన్‌, ఎల్డ‌ర్లీ సీటింగ్ ఏరియా, బ‌ట్ట‌ర్‌ఫ్లై/ ఫ్ల‌వ‌ర్ గార్డెన్‌, యోగా/లాఫ్ట‌ర్ క్ల‌బ్స్‌, డెడికేటెడ్ వైఫై జోన్లు, ఆర్టిఫిషీయ‌ల్ లేక్‌ వంటివి డెవ‌ల‌ప్ చేస్తారు.
  • రెండు క్ల‌బ్‌హౌజుల‌ను అత్యాధునికంగా తీర్చిదిద్దుతారు. ఇందులో లాప్ అండ్ రిక్రియేషనల్ పూల్, పూల్ డెక్, పూల్ డైనింగ్ పెవీలియ‌న్స్‌, రిఫ్లెక్టింగ్ పూల్‌, ఔట్ డోర్ డైనింగ్ స్పేస్ వంటి వాటిలో ప్ర‌జ‌లెంతో సంతోషంగా గ‌డ‌పొచ్చు.

డాగ్ పార్క్‌..

అపార్టుమెంట్ల‌లో శున‌కాల్ని పెంచుకోవాల‌ని చాలామంది భావిస్తారు. కానీ, వాటిని బ‌య‌టికి తీసుకెళ్లే అవ‌కాశం లేక‌పోవ‌డం వ‌ల్ల పెంచుకోవ‌డానికి వెన‌క‌డుగు వేస్తారు. ఈ అంశాన్ని గ‌మ‌నించిన వాస‌వి గ్రూప్ ఆనంద నిల‌యంలో ప్ర‌త్యేకంగా ఒక డాగ్ పార్కును అభివృద్ధి చేయాల‌ని నిర్ణ‌యించింది. అంతేకాదు, వివిధ ప్రాంతాల్లోని ఆహారాన్ని ఇందులోని ప్ర‌జ‌లు ఆస్వాదించాల‌న్న ఉద్దేశ్యంతో వాస‌వి సంస్థ వినూత్నంగా ఆలోచించి.. ప్ర‌త్యేకంగా ఫుడ్ ట్ర‌క్ జోన్‌ను ఏర్పాటు చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. దీని వ‌ల్ల ఇందులోని ప్ర‌జ‌లు వివిధ ర‌కాల ఆహారాన్ని ఆస్వాదించే అవకాశం లభిస్తుంది.

This website uses cookies.