Categories: LATEST UPDATES

గ్రేటర్ లో రియల్ జోరు.. భారీగా పెరిగిన రిజిస్ట్రేషన్లు

గ్రేటర్ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ జోరుగా సాగుతోంది. గత ఏడు నెలల్లో రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం భారీగా పెరగడమే ఇందుకు కారణం. 2023 డిసెంబర్ నుంచి ఈ ఏడాది జూన్ వరకు ఏడు నెలల్లో ఫ్లాట్లు, భవనాల రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.4,670.52 కోట్ల ఆదాయం లభించిందని అధికార వర్గాలు వెల్లడించాయి. అంతకుముందు ఏడు నెలల ఆదాయంతో పోలిస్తే ఇది రూ.241.29 కోట్లు అధికం కావడం గమనార్హం.

2022 డిసెంబర్ నుంచి 2023 జూన్ వరకు వచ్చిన ఆదాయంతో పోల్చినా కూడా ఇది రూ.270.86 కోట్లు ఎక్కువ. మొత్తమ్మీద గత ఏడు నెలల్లో 2,18,160 రిజిస్ట్రేషన్లు జరగ్గా.. అంతకుముందు ఏడాది ఏడు నెలల్లో 1,93,962 రిజిస్ట్రేషన్లు జరిగాయి. కాగా, ఈ ఏడాది ఇప్పటివరకు 54,111 ప్లాట్ల రిజిస్ట్రేషన్ జరగ్గా.. గతేడాది ఇదే వ్యవధిలో 50,535 ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి. అంటే అప్పటికి, ఇప్పటికి 7 శాతం పెరుగుదల నమోదైంది. మరోవైపు కొత్త భవనాలకు ఇచ్చే అనుమతులు కూడా పెరుగుతున్నాయి. గత ఏడు నెలల్లో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో 18,077 భవనాలకు అనుమతులు వచ్చాయి.

This website uses cookies.