వారం వారం కింద ప్రముఖుల ఇళ్ల విశేషాలను వివరిస్తున్న సెలబ్రిటీ హోమ్స్ ప్రయాణం చాలా ఆకర్షణీయంగా సాగుతోంది. అభిమాన తారల ఇళ్ల వివరాలను, వారి ఆకాంక్షలను తెలియజేస్తూ ముందుకెళ్తోంది. అద్భుతమైన భవనాల నుంచి కళాత్మకంగా క్యూరేట్ చేసిన అపార్ట్ మెంట్ల వరకు తారల తాలూకు ఇళ్లను కళ్లకు కడుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు మేం చూసిన, మాపై చెరగని ముద్ర వేసిన టాప్-10 ప్రముఖల ఇళ్లను మీరు మరోసారి గుర్తు చేస్తున్నాం. అవేంటో చూసేయండి మరి..
హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక జూబ్లీహిల్స్ లో ఉన్న మెగాస్టార్ చిరంజీవి నివాసం గొప్పతనానికి, వారసత్వానికి నిదర్శనంగా నిలుస్తుంది. 25వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ భవనాన్ని ముంబైకి చెందిన తహిలియాని హోమ్స్ డిజైన్ చేసింది. నిజాం కాలం నాటి డిజైన్ కు ఆధునిక నిర్మాణాలను జోడించి అద్భుతంగా దీనిని రూపొందించారు. గంభీరంగా ఉండే పూజా మందిరం, విశాలమైన ఉద్యానవనం.. అందులో టెన్నిస్ కోర్టు, ప్యాలెస్ లాంటి ఎస్టేట్ లో ప్రతి మూలలోనూ చక్కదనం తాండవిస్తుంది. ఇక్కడ అన్నీ భారీగానే ఉంటాయి. సమావేశ మందిరాల నుంచి పచ్చిక బయళ్లు వరకు అన్నీ పెద్దవే. ఇక చిరంజీవి మనవరాలు, రాంచరణ్-ఉపాసన దంపతుల కుమార్తె క్లిన్ కారా కోసం ఏర్పాటు చేసిన నర్సరీ శాంతి, తేజస్సును వెదజల్లుతుంది. ఆ నర్సరీలో ప్రతిదీ అద్భుత కళాఖండమే.
నటి సోనాక్షి సిన్హా ఇంట్లో హైలైట్ అంశం రచ్చబండ. ముంబైలోని ఆమె నివాసంలో ఏర్పాటు చేసిన ఈ రచ్చబండను కన్వర్సేషన్ పిట్ అంటారు. ఊళ్లలో ఉండే రచ్చబండకు మోడ్న్ టచ్ తో అద్భుతంగా రూపొందించారు. రెడ్ ఆర్కిటెక్ట్స్ కి చెందిన రాజీవ్, ఏక్తా పరేఖ్ లు కలిసి సోనాక్షి అపార్ట్ మెంట్ ని డిజైన్ చేశారు. క్లాసిక్ ఫ్లెయిర్ ని మోడ్రన్ సెన్సిబిలిటీతో కలపడానికి ఇది ఓ అద్భుతమైన ఉదాహరణ. ఈ అపార్ట్ మెంట్ బాల్కనీలో పర్సనల్ స్విమింగ్ పూల్ కోసం స్థలం కేటాయించారు. సందడిగా ఉండే ముంబై వంటి నగరంలో సోనాక్షికి తన ఇల్లు ప్రశాంతమైన రిట్రీట్ గా పనిచేస్తుంది.
నాటింగ్ హిల్ పరిసరాల్లో నటి సోనమ్ కపూర్ నివాసం ఆమె శక్తివంతమైన వ్యక్తిత్వం, కళాత్మకత, భారతదేశం పట్ల ప్రేమను ప్రతిబింబిస్తంది. సున్నితమైన డి గౌర్నే వాల్‌పేపర్‌లు, పరిశీలనాత్మక అలంకరణలతో అలంకరించిన ఆమె ఇల్లు అటు భారతీయ మూలాలు, ఇటు లండన్ అధునాతన సమ్మేళనంగా ఉంటుంది. ప్రతి మూలలో ఆమె సౌందర్యం, వారసత్వం పట్ల లోతైన ప్రశంసలను ప్రదర్శించే శక్తివంతమైన రంగులు అదరహో అనిపిస్తాయి.
టాలీవుడ్ నటుడు రానా దగ్గుబాటి నివాసం ధైర్యమైన సౌందర్యం మరియు క్రియాత్మక గాంభీర్యం యొక్క సమ్మేళనం. తన ఇల్లు డెన్ కంటే తక్కువేం కాదని పేర్కొన్నారు. పుస్తకాలు చదవడం కోసం ఓ ప్రత్యేకమైన గదితోపాటు సినిమాలకు సంబంధఇంచిన సమస్యల నుంచి తప్పించుకోవడానికి ఇంట్లోనే బార్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. సినిమా పోస్టర్‌లు మరియు విలక్షణమైన డెకరేషన్ తో అలంకరించిన రానా ఇల్లు సృజనాత్మకత, ఆయన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది.
నటి హన్సిక మోత్వాని ఆధ్యాత్మికత, వ్యక్తిగత అభిరుచులతో తన నివాసాన్ని నింపేశారు. ఒక మినీ గురుద్వారా ఆమె ఇంటికి గుండెగా నిలుస్తుంది. సందడిగా ఉండే నగరం మధ్య ఓదార్పు మరియు ప్రశాంతతను అందిస్తుంది. కళ, దాతృత్వం పట్ల ఆమెకున్న అభిరుచి ఇంట్లోని ప్రతి మూలలోనూ స్పష్టంగా కనిపిస్తుంది. బుద్ధుడు-నేపథ్య చిత్రాలు, గ్యాలరీ వంటి వాతావరణం ఆమె దయను, కళాత్మక నైపుణ్యాన్ని తెలియజేస్తుంది.
హైదరాబాద్ లో నటుడు అల్లు అర్జున్ ఇంటి పేరు బ్లెస్సింగ్. ఆధునిక లగ్జరీ, సౌందర్య నైపుణ్యానికి ప్రతిబింబంగా కనిపిస్తుంది. సంపన్న జూబ్లీహిల్స్ లో ఉన్న ఈ భవనంలో మినిమలిస్ట్ ఆర్కిటెక్చర్, విశాలమైన ఇంటీరియర్స్, అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి. విశాలమైన పెరడు నుంచి ల్యాండ్ స్కేప్ గార్డెన్లతో అత్యాధునిక గృహ ఆటోమేషన్ సిస్టమ్, భారీ స్విమింగ్ పూల్, విశ్రాంతి కోసం అద్భుతమైన ప్రాంతాలతో ఆయన ఇల్లు సమకాలీన జీవనశైలికి ప్రతిబింబంగా కనిపిస్తుంది. దాదాపు 2 ఎకరాల స్థలంలో నిర్మించిన ఈ ఇంట్లో నివసించడం ఓ వరం.
నటుడు విజయ్ దేవరకొండ ఇల్లు ఆధునిక మినిమలిజానికి నిదర్శనం. క్లీన్ లైన్లు, మ్యూట్ టోన్లు, తక్కువ గాంభీర్యంతో ఉంటుంది. ఇంటిమేట్ రిలాక్సేషన్ కార్నర్‌ల నుంచి విశాల దృశ్యాలతో కూడిన స్టైలిష్ రూఫ్‌టాప్ లాంజ్ వరకు ఆయన నివాసంలోని ప్రతి అంశం అధునాతనత, ప్రశాంతత గురించి మాట్లాడుతుంది. మల్టీ-ఫంక్షనల్ బార్ ప్రాంతం అద్భుతంగా ఆకర్షిస్తుంది. ఇది వ్యక్తిగత విశ్రాంతి, సామాజిక సమావేశాలు రెండింటికీ సరైన స్థలంగా నిలుస్తుంది.
నటుడు ప్రభాస్ నివాసం హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో పచ్చని చెట్ల మధ్య కనిపిస్తుంది. అదిరిపోయే ఎంట్రన్స్, విశాలమైన తోటలతో అద్భుతంగా ఉంటుంది. వ్యక్తిగత టచ్ తో రూపొందించిన స్విమింగ్ పూల్, విశాలమైన ప్రీమియం జిమ్ వంటి విలాసవంతమైన సౌకర్యాలను కలిగి ఉంది. ప్రభాస్ ఇల్లు.. ప్రకృతి పట్ల ఆయనకున్న ప్రేమను తెలియజేస్తుంది. ఇంటి చుట్టూ పచ్చిక బయళ్లు, తోటల రూపంలో భారీగా బహిరంగ ప్రదేశాలు ఉండేలా చూసుకున్నారు. మొత్తానికి ప్రభాస్ ఇల్లు చాలా చెట్లకు నిలయం. ప్రశాంతతకు చిరునామా.
ఇంటి పరిమాణం కాదు.. దానిని ఎలా తీర్చిదిద్దుకున్నామనేదే ముఖ్యమని నటి మంచు లక్ష్మి నిరూపించారు. హైదరాబాద్ లోని భారీ బంగ్లా నుంచి ఆమె ముంబైలో ఓ చిన్న ఇంటికి మారారు. అయితే, ఆమె ఆ ఇంటిని హైదరాబాద్ ఇంట్లోని ఫర్నిచర్, ఇతరత్రా అనేక అంశాలతో పునర్నిర్మించిన విధానం అబ్బురపరుస్తుంది. మంచు లక్ష్మి నివాసం.. కళాత్మకత, మినిమలిజం మిశ్రమం. అలాగే ప్రశాంతత కోసం అనేక పెయింటింగ్స్ ఏర్పాటు చేశారు. విశాలమైన బాల్కనీలు, ఆలోచనాత్మకమైన డెకర్ తో ఆమె ఇల్లు ఔరా అనిపిస్తుంది.
నటి అలియా భట్ ముంబై జుహూలోని ఇల్లు పాశ్చాత్త శైలి ఇంటీరియర్ తో కనిపిస్తుంది. పెద్ద పెద్ద కిటికీల నుంచి పచ్చదనాన్ని వీక్షించేలా డిజైన్ చేశారు. విశ్రాంతి తీసుకోవడానికి పూర్తి గోప్యతగా ఉండటానికి చాలా అనువుగా రూపొందించారు. వెచ్చని టోన్లతోపాటు సహజ కాంతి లోపలకు ప్రసరించి ఆహ్లాదం కలిగిస్తుంది. మొత్తానికి ఆమె ఇల్లు తన శక్తివంతమైన, పొందికైన వ్యక్తిత్వానికి నిదర్శనంగా నిలుస్తుంది.
హైదరాబాద్ నుంచి లండన్ వరకు ఈ సెలబ్రిటీల ఇళ్లు వారు నివసించే స్థలాలు మాత్రమే కాదు.. వారి అభిరుచులు, ఆకాంక్షలు, వ్యక్తిత్వానికి ప్రతిబింబాలు. వినోద ప్రపంచంలో గ్లామర్, గాంభీర్యత ప్రదర్శించే వారి జీవితాల్లో ఆ ఇళ్లే పెద్ద ఉపశమనం. వారి ప్రతి నివాసం విజయం, సృజనాత్మకత, కలల సాధనకు సంబంధించి ఓ ప్రత్యేక కథను చెబుతాయి. మా టాప్-10 జాబితాలో ఉన్న ప్రతి సెలబ్రిటీ హోమ్.. వారి జీవితం, వ్యక్తిత్వం గురించి ప్రత్యేక సంగ్రహావలోకనం అందిస్తుంది. సంపన్నమైన రాజభవనాల నుంచి ఆధునిక ఫ్లాట్ల వరకు ఈ నివాసాలు అద్భుతమైన డిజైన్ ను ప్రదర్శించడమే కాకుండా వారి వ్యక్తిగత అభిరుచులు, జీవనశైలిని ప్రతిబింబిస్తాయి.
This website uses cookies.