Categories: LEGAL

చింటెల్స్ పారాడిస్కోకు నాలుగు నెలల గడువు

  • ఆలోగా కొనుగోలుదారులకు డబ్బు చెల్లించాలి
  • లేదా ఫ్లాట్ మళ్లీ నిర్మించి ఇవ్వాలి

గురుగ్రామ్ లోని చింటెల్స్ పారాడిస్కో టవర్లకు సంబంధించి కొనసాగుతున్న అనిశ్చితి ఓ కొలిక్కి వచ్చింది. అందులోని ఫ్లాట్ కొనుగోలుదారులు బయ్ బ్యాక్ ఆప్షన్ ఎంచుకుంటే.. వారికి ఫ్లాట్ ధర (చదరపు అడుగుకు రూ.6500)తోపాటు స్టాంపు డ్యూటీని నాలుగు నెలల్లోకి బిల్డర్ తిరిగి చెల్లించాలి. ఒకవేళ అందులో ఏమైనా ఇంటీరియర్ వర్క్ చేసి ఉంటే దానికి సంబంధించిన మొత్తం కూడా తిరిగి ఇవ్వాలి. లేదా నిపుణుల సూచనల మేరకు భవనాలను మళ్లీ నిర్మించి ఇవ్వాలి. ఈ మేరకు అధికారులు చింటెల్స్ పారాడిస్కో యాజమాన్యాన్ని ఆదేశించారు. దాదాపు ఏడాది క్రితం ఆరో అంతస్తు స్లాబ్ కూలిన ఘటనలో ఇద్దరు మహిళలు చనిపోయారు. దీంతో ఈ టవర్ల భవితవ్యం, భద్రతపై నీలినీడలు అలుముకున్నాయి.

ఐఐటీ ఢిల్లీకి చెందిన నిపుణుల బృందం ఈ టవర్లను పరిశీలించి మరమ్మతులకు వీలుకాని నిర్మాణ లోపాలను గుర్తించింది. దీంతో ఆ టవర్లను కూల్చివేయాలని సూచించింది. ఈ నేపథ్యంలో ఇందులో ఫ్లాట్లు కొనుగోలు చేసినవారు నష్టపోకుండా చూసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అటు బిల్డర్, ఇటు కొనుగోలుదారులతో చర్చించి ఈ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీని ప్రకారం ఫ్లాట్ వద్దునుకునేవారికి కంపెనీ దాని ఖరీదుతోపాటు స్టాంపు డ్యూటీ, ఇంటీరియర్ వర్క్ కు అయిన వ్యయాన్ని కొనుగోలుదారుకు నాలుగు నెలల్లోగా చెల్లించాలి. ఒకవేళ ఫ్లాట్ కావాలనుకునేవారికి మూడేళ్లలో దానిని పునర్ నిర్మించి ఇవ్వాలని సూచించారు.

This website uses cookies.