Categories: AREA PROFILE

కొత్త రెసిడెన్షియల్ హబ్ గా ఉప్పల్

తూర్పు హైదరాబాద్ లో ఉన్న ఉప్పల్.. హైదరాబాద్ లో కొత్త రెసిడెన్షియల్ హబ్ గా అవతరించింది. ప్రధాన ప్రాంతాలకు సమీపంలో ఉండటంతోపాటు పలు సౌకర్యాలు ఉండటంతో ఇటీవల ఇక్కడ రియల్ ఎస్టేట్ దూసుకెళ్తోంది. 700 మీటర్ల దూరంలో మెట్రో స్టేషన్ తోపాటు 28 కిలోమీటర్ల దూరంలో శంషాబాద్ విమానాశ్రయం కలిగి ఉన్న ఉప్పల్ ప్రాంతం.. 163వ నెంబర్ జాతీయ రహదారి, ఇన్నర్ రింగ్ రోడ్డు ద్వారా నగరంలోని వివిధ ప్రాంతాలకు మంచి కనెక్టివిటీ ఉండటంతో చాలామంది ఇటు మొగ్గు చూపిస్తున్నారు.

ఎన్ఎస్ఎల్ అరేనా సెజ్, పోచారం మైండ్ స్పేస్, ఇన్ఫోసిస్ సెజ్ తోపాటు కేంద్రీయ విద్యాలయం, ఉస్మానియా యూనివర్సిటీ వంటివి ఇక్కడ ఉన్నాయి. అంతేకాకుండా పలు మాల్స్, అనేక ఆస్పత్రులు, రెస్టారెంట్లు, పాఠశాలలు, ఇతర మౌలిక సదుపాయాలు కూడా ఉన్నాయి. దీంతో చాలామంది మధ్య, ఎగువ మధ్యతరగతికి చెందిన జనం ఇక్కడ ఇళ్లు కొనుగోలు చేయడానికి ప్రోత్సహిస్తున్నాయి. పైగా నగరంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే.. రియల్ ఎస్టేట్ ధరలు ఇక్కడ కాస్త అందుబాటులో ఉండటం మరో కారణం.

ఉప్పల్ లో ప్రస్తుతం చదరపు గజం ధర దాదాపు రూ.లక్ష వరకు ఉండగా.. అపార్ట్ మెంట్ ధర చదరపు అడుగుకు రూ.6వేల నుంచి 13 వేల మధ్యలో ఉంది. దాదాపు రూ.25 లక్షలకు 1 బీహెచ్ కే వస్తుండగా.. రూ.50 లక్షలకు 2 బీహెచ్ కే, రూ.88 లక్షలకు 3 బీహెచ్ కే వస్తున్నాయి. ఇక ఈ ప్రాంతం యాదాద్రి భువనగిరి, వరంగల్ తదితర జిల్లాలకు కనెక్ట్ అయి ఉంది. అలాగే హెచ్ఎండీఏ పరిధిలో పలు ప్రాజెక్టులు కూడా వస్తున్నాయి. ఇక్కడ చదరపు గజం రూ.90వేల నుంచి రూ.లక్ష మధ్యలో ఉంది. దీంతో ఉప్పల్ కొత్త రెసిడెన్షియల్ హబ్ గా దూసుకెళ్తోంది.

This website uses cookies.