Categories: TOP STORIES

గుట్టల బేగంపేట్ చెరువుని పరిరక్షించాలి

మట్టి, రాళ్లతో చదును చేసిన గుట్టల బేగంపేట్ చెరువుని పరిరక్షించాలని పర్యావరణవేత్త డాక్టర్ లుబ్నా సార్వత్ కోరారు. ఆమె శుక్ర‌వారం గుట్ట‌ల బేగంపేట్ చెరువు దురాక్ర‌మ‌ణ‌కు గురైన విష‌యాన్ని.. ఉప‌గ్ర‌హ చిత్రాల‌తో స‌హా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఈ చెరువు ఇన్ ఫ్లో ఛానెల్ ను ధ్వంసం చేశారని.. చెరువు పక్కన కొందరు వ్యక్తులు దురాక్రమణ చేశారని తెలిపారు.

అధికారులు వెంటనే రంగంలోకి దిగి.. గుట్టల బేగంపేట్ చెరువును పరిరక్షించాలని విజ్ఞ‌ప్తి చేశారు. ఈ చెరువుని పున‌రుద్ధ‌రిస్తే అది నీటిని అందించ‌టంతో పాటు చుట్టుప‌క్క‌ల ప్రాంతాలకు వ‌ర‌ద‌ నీరు రాకుండా నిరోధిస్తుంద‌ని తెలిపారు. త‌మ ఫిర్యాదును ఎన్‌జీటీలో కేసు దాఖ‌లు చేయ‌డానికి ముంద‌స్తు నోటీసుగా ప‌రిగ‌ణిస్తామ‌ని తెలిపారు.

వ‌ర్షాలు ప‌డిన‌ప్పుడ‌ల్లా.. గుట్టల బేగంపేట్ చెరువు ప‌క్క‌నే గ‌ల కాక‌తీయ హిల్స్‌లోని ఇళ్ల‌కు నీళ్లు చేరుతాయి. ఆ కాల‌నీ రోడ్ల‌న్నీ నీళ్ల‌తో నిండిపోతాయి. ఇటీవ‌ల ఈ చెరువు వెన‌క భాగంలో కొంద‌రు అక్ర‌మార్కులు అపార్టుమెంట్ల‌ను క‌ట్టేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. అయ్య‌ప్ప సొసైటీకి వెళ్లే దారిలో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ లైట్లకు ఒక‌వైపు గోదావ‌రి క‌ట్స్ అనే వ్యాపార స‌ముదాయాన్ని ఏర్పాటు చేశారు. వీటి మీద నెల‌కొన్న దురాక్ర‌మ‌ణ‌ల‌న్నీ తొల‌గించాలని స్థానికులు కోరుతున్నారు.

This website uses cookies.