Categories: TOP STORIES

రియాల్టీ వెంచ‌ర్‌లో హ‌రిత‌హారం

  • శ్రీకారం చుట్టిన సుచిరిండియా సిల్వ‌ర్ సాండ్స్ సంఘం

సుచిరిండియా సిల్వర్ సాండ్స్ నివాసితుల సంఘం ఇటీవల ముత్తంగిలో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ప్లాట్ల యజమానులంతా కలిసి తమ ప్లాట్లలో మొక్కల్ని నాటారు. ప్రతిఒక్కరూ తమ సామాజిక బాధ్యతగా ప్లాట్లలో సైతం మొక్కల్ని నాటాలని సంఘం పిలుపునిచ్చింది. వాస్తవానికి, అనేక మంది ప్లాట్లు కొనుగోలు చేసి.. వాటిని పెద్దగా పట్టించుకోరు. చాలా సందర్భాల్లో ఆయా ప్లాట్లలో పిచ్చి మొక్కలొస్తాయి. అలా కాకుండా, ఏటా ఆయా స్థల యజమానులు మొక్కల్ని నాటితే ఆయా వెంచర్ మొత్తం ఆహ్లాదకరంగా కనిపిస్తుందని సంఘం భావించింది.

అందుకే, ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు జి. శ్రీనివాస్ మాట్లాడుతూ.. వారాంతంలో పచ్చదనం మధ్య గడిపితే ఆరోగ్యానికి ఎంతో మంచిదన్నారు. తెలంగాణలోని వివిధ వెంచర్లలో ప్లాట్లు కొన్నవారంతా.. యుద్ధప్రాతిపదికన ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు. తమకు రెండు వేల మొక్కల్ని ఉచితంగా అందించిన హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ డిపార్టుమెంట్‌కి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో సుచిరిండియా సిల్వర్ సాండ్స్ నివాసితుల సంఘం కోర్‌ కమిటీ సభ్యులైన‌ పుల్లారెడ్డి, శ్రీకాంత్‌, నాగదీప్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

This website uses cookies.