కొనుగోలుదారులకు బిల్డర్ చెల్లించాల్సిన మొత్తానికి సంబంధించిన చెక్ బౌన్స్ అయితే ఆ మొత్తానికి రెట్టింపు చెల్లించాల్సిందేనని ఓ కోర్టు తీర్పు ఇచ్చింది. ముంబైకి చెందిన ఇద్దరు సోదరులు.. ప్రిషా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన ఓ ప్రాజెక్టులో 2014 చెరో ఫ్లాట్ బుక్ చేసుకున్నారు. అనుజ్ కుమార్ ఝా 503 చదరపు అడుగుల ఫ్లాట్ ను రూ. 54 లక్షలకు కొనుగోలు చేసి రూ.16 లక్షలు చెల్లించగా.. ఆయన సోదరుడు పంకజ్ కుమార్ ఝా 665 చదరపు అడుగుల ఫ్లాట్ ను రూ. 80 లక్షలకు బుక్ చేసుకుని రూ. 25 లక్షలు చెల్లించారు. ఒప్పందం ప్రకారం 2016 లోగా బిల్డర్ వాటిని అప్పగించాల్సి ఉంది. అయితే, బిల్డర్ గడువులోగా ఫ్లాట్లను అప్పగించలేదు. దీంతో ఒప్పందం రద్దయింది. అయితే, ఝా సోదరులు చెల్లించిన రూ.41 లక్షలను బిల్డర్ వెనక్కి ఇవ్వలేదు. అంతకుముందు బిల్డర్ ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయి. దీంతో ఝా సోదరులు కోర్టుకు వెళ్లారు. దీనిపై వాదనలు విన్న కోర్టు.. చెక్ బౌన్సు అయినందుకు రెట్టింపు మొత్తం రూ. 82 లక్షలు చెల్లించాలని ఆదేశించింది.