బీమ్స్ అండ్ కాలమ్స్ సంస్థ కొంపల్లిలో హైరైజ్ ప్రాజెక్టు చేపట్టింది. మొత్తం 17 అంతస్తుల్లో 170 ఫ్లాట్లు అందుబాటులోకి రానున్నాయి. అలాగే ప్రస్తుతం 3.2 ఎకరాల్లో 4 బ్లాకుల్లో మరో ప్రాజెక్టు పనులు చేస్తోంది. ఇక్కడ మొత్తం 360 ఫ్లాట్లు అందుబాటులోకి వస్తాయి. 1250 చదరపు అడుగుల నుంచి 1850 చదరపు అడుగుల మధ్యలో 2 బీహెచ్ కే, 3 బీహెచ్ కే ఫ్లాట్లు లభ్యమవుతాయి. అన్ని సౌకర్యాలతోపాటు ఫుల్లీ ఎక్విప్ మెంట్ తో క్లబ్ హౌస్ కూడా నిర్మిస్తున్నారు. ఇక ఫ్లాట్ కి ఫ్లాట్ కి మధ్య పది అడుగుల దూరం ఉండేలా డిజైన్ రూపొందించారు. కామన్ వాల్స్ అనేవే లేకుండా ప్రాజెక్టును తీర్చిదిద్దారు. వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేసి ఫ్లాట్లు అప్పగిస్తారు.
This website uses cookies.