- హెచ్ఎండీఏ చరిత్రలో ప్రప్రథమంగా
- వేలంలో ప్లాట్లు వద్దన్న బయ్యర్లు
- ఈ ధరలే మిగతా వెంచర్లకూ వర్తించదు
హెచ్ఎండీఏ.. ఎక్కడ లేఅవుట్ వేసినా.. ప్రజల్నుంచి మంచి స్పందన లభిస్తుంది. ఒక ప్లాటును కొనడానికి కనీసం ఇద్దరు లేదా ముగ్గురు పోటీ పడతారు. అలాంటిది, ఇటీవల తొర్రూరులో నిర్వహించిన వేలం పాటల్లో ప్లాట్లు కొనేవారు కరువయ్యారు. ఎన్నడూ లేని విధంగా.. కేవలం పాతిక శాతం ప్లాట్లే అమ్ముడయ్యాయి. 48 ప్లాట్లను వేలం నిర్వహించగా కేవలం 12 ప్లాట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. మరి, ఒక్కసారిగా ఇలా ఆదరణ తగ్గడానికి కారణమేమిటి?
అమెరికా ఆర్థికమాంద్యం ప్రభావం క్రమక్రమంగా కళ్ల ముందే సాక్షాత్కరిస్తోంది. తమ ఉద్యోగాలుంటాయో.. ఊడతాయేమోనని విదేశాల్లో పని చేసే ఐటీ నిపుణుల్లో ఆందోళన ఆరంభమైంది. ఫలితంగా, హైదరాబాద్‌లో నివసించే ఐటీ ఉద్యోగులూ.. ప్లాట్లు, ఫ్లాట్లలో పెట్టుబడి పెట్టేందుకు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ ప్లాట్లను కొనట్లేదు. కొందరేమో అత్యవసరమైతే తప్ప రియల్ రంగంలో పెట్టుబడుల్ని పెట్టడం లేదు. మంచి హాట్ లొకేషన్లో.. మార్కెట్ రేటు కంటే మరీ తక్కువకొస్తేనే కొంటున్నారు.