హొగర్ కంట్రోల్స్ తాజాగా స్మార్ట్ టచ్ ప్యానెల్స్, అంతర్జాతీయస్థాయి కంట్రోలర్స్, డిజిటల్ డోర్ లాక్స్, స్మార్ట్ కర్టైన్ మోటార్స్ తో కూడిన సరికొత్త ఎలైట్ సిరీస్ ను భారతీయ మార్కెట్లోకి ఆవిష్కరించింది. అమెరికాకు చెందిన ఈ కంపెనీ 2019లో హైదరాబాద్లో అసెంబ్లింగ్ యూనిట్ నెలకొల్పింది. 2022 ఏప్రిల్ నుంచి తయారీ ప్రక్రియను ప్రారంభించింది. భారత మార్కెట్ కోసం కస్టమ్ డిజైన్డ్ ఉత్పాదనల తయారీని ప్రారంభించింది. ఇంటి యజమానులు, రిటైలర్లు, ప్రొఫెషనల్ ఇంటిగ్రేటర్లకు వినూత్న, స్టైలిష్ ఉత్పాదనలను అందిస్తోంది.
హోమ్ ఆటోమేషన్ మార్కెట్లో ఓమ్ని చానల్ బిజినెస్ ను నిర్మించుకోవడం పై దృష్టి పెట్టిన హొగర్ కంట్రోల్స్ తన మొదటి ఎక్స్ క్లూజివ్ హోగర్ కంట్రోల్స్ ఎక్స్ పీరియెన్స్ సెంటర్ ను ఢిల్లీలో ప్రారంభించింది. కొనుగోలుదా రులకు స్మార్ట్ హోమ్ లివింగ్ ను స్వయంగా అనుభూతి చెందే అవకాశాన్ని కల్పిస్తుంది. అదంతా ఒక్క చోటే – 6000 చ.అ.ల విస్తీర్ణంలోని భారీ స్టోర్ లో. ప్రముఖ ఆర్కిటెక్ట్ లు, ఇంటీరియర్ డిజైనర్ల సమక్షంలో ఈ స్టోర్ ను ఐఐఐడి ఢిల్లీ శాఖ చైర్మన్ సరితా విహారి ఇటీవల ప్రారంభించారు.
ఈ సందర్భంగా హొగర్ కంట్రోల్స్ సీఈవో విష్ణు రెడ్డి మాట్లాడుతూ ‘‘ఐఓటి ప్రభావం ఇప్పటికే ప్రతీ ఒక్కరి ఇంట్లో కనిపిస్తోంది. మేం భారతదేశవ్యాప్తంగా మా కార్యకలాపాలను విస్తరించడాన్ని లక్ష్యంగా చేసుకున్నందున, అతి త్వరలోనే మేం మా ఎక్స్ పీరియెన్స్ సెంటర్ లను హైదరాబాద్, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్ కతాలలో ప్రారంభించనున్నాం’’ అని అన్నారు. హొగర్ కంట్రోల్స్ వైస్ ప్రెసిడెంట్ జస్ప్రీత్ సింగ్ భాటియా మాట్లాడుతూ, ‘‘ప్రధానంగా హెచ్ఎన్ఐ కమ్యూనిటీని దృష్టిలో ఉంచుకొని రూపొందించిన ప్రస్తుత ప్రీమియం శ్రేణి ఉత్పాదనలకు తోడుగా నూతన శ్రేణి ఉత్పాదనలు మరింత పెద్ద మార్కెట్ అవసరాలను తీర్చేలా తయారయ్యాయ’’ని అన్నారు.
This website uses cookies.