‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద నిర్మించిన ఇళ్లను లక్ష మందికిపైగా పేదలకు వంద రోజుల్లో అప్పగిస్తాం’ – ఇదీ యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య గురువారం చేసిన ప్రకటన. ఇందుకోసం వంద రోజుల కార్యాచరణ ప్రణాళికను సైతం యూపీ సర్కారు సిద్దం చేసుకుని ఆ దిశగా వడివడిగా అడుగులు కూడా వస్తోంది. కానీ మన రాష్ట్రంలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది.
రాష్ట్రంలోని పేదలకు రెండు లక్షల ఇళ్లు ఇస్తామని ప్రకటనలు గుప్పించారే తప్ప.. వాటి నిర్మాణంలో మాత్రం అడుగు ముందుకు పడటంలేదు. కొన్నిచోట్ల పూర్తయిన డబుల్ బెడ్ రూం ఇళ్లను సైతం లబ్ధిదారులకు అందజేయడంలేదు. దీంతో చాలాచోట్ల ఆయా ఇళ్లలో పిచ్చిమొక్కలు పెరిగడం.. ఇళ్లు పాడైపోవడం వంటివి చోటు చేసుకుంటున్నాయి. కళ్ల ముందే తమ ఇళ్లు అలా పాడైపోవడాన్ని చూసి తట్టుకోలోని లబ్ధిదారులు తాళాలు బద్దలుకొట్టి మరీ గృహ ప్రవేశాలు చేసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో పేదలకు ఇళ్లు ఇచ్చే విషయంలో మన ప్రభుత్వ పెద్దలు యూపీని చూసి నేర్చుకోవాలనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ అంశంలో యోగి ఆదిత్యనాథ్ సర్కారు చాలా సీరియస్ గా, ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తుండగా.. మన రాష్ట్రంలో అందుకు భిన్నమైన పరిస్థితి ఉందనే ఆవేదన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో దీనిని కేవలం ఓ ఎలక్షన్ స్టంట్ గానే చూస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇప్పటికైనా సంబంధిత అధికారులు వీలైనంత త్వరగా డబుల్ బెడ్రూం ఇళ్లను లబ్దిదారులకు అందించాలని పలువురు కోరుతున్నారు.
This website uses cookies.