Categories: LATEST UPDATES

ట్రిలియన్ డాలర్ల అవకాశం

స్మార్ట్ సిటీ అభివృద్ధికి ట్రిలియన్ డాలర్ల వ్యాపార అవకాశం ఉందని 2025 నాటికి మార్కెట్ పరిమాణంలో 1.3 ట్రిలియన్లు డా లర్లు అంచనా వేస్తున్నట్లు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ‘టెక్నాలజీ పయనీర్ 2019’ అవార్డు గ్రహీత, అమెరికాకు చెందిన క్వాంటెలా వ్యవస్థాపకుడు & ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ శ్రీధర్ గాధి తెలిపారు. సంగారెడ్డిలో వోక్సెన్ విశ్వవిద్యాలయంలో మూడు రోజుల గ్లోబల్ ఇంపాక్ట్ సమ్మిట్‌లో ఆయ‌న మాట్లాడుతూ, వ్యాపారాలు తనను ఎంతగా ఆడుకున్నాయో గుర్తు చేసుకున్నారు. పట్టణ మౌలిక సదుపాయాల కార్యకలాపాలను ఆటోమేట్ చేయడం మరియు ఆప్టిమైజ్ చేయడంలో క్వాంటెలా సంస్థ సేవలను అందిస్తుంద‌న్నారు. పౌరుల జీవితాన్ని సులభతరం చేయడానికి సేవలను అందించే వ్యాపారంలో ప్ర‌భుత్వం ఉందన్నారు.

నగరాలు ప్రపంచంలోని ఉపరితల వైశాల్యంలో కేవలం 2% ఆక్రమించనప్పటికీ, అవి ప్రపంచ జనాభాలో దాదాపు 50% జనాభాను కలిగి ఉన్నాయని చెప్పారు. 2050 నాటికి 2.5 బిలియన్ల మంది ప్రజలు పట్టణ ప్రాంతాలకు తరలి వెళతారని అంచనా వేశారు. మన దేశంలోని 18% ఆర్థిక వ్యవస్థను నగరాలు సృష్టిస్తున్నాయని వెల్ల‌డించారు. కాక‌పోతే, గ్రీన్‌హౌస్ వాయువుల విడుదలలో 75% నగరాలదే బాధ్యత అన్నారు. ప్రపంచ జిడిపిలో నగరాల వాటా 80% దాకా ఉంటుంద‌న్నారు.

This website uses cookies.