సొంతిల్లు.. అనేది ప్రతి ఒక్కరి కల. అయితే కష్టపడి కూడబెట్టుకున్న డబ్బుతో సొంతిల్లు కొనుక్కోవడమే కాదు.. ఆ ఇంటికి బీమాతో రక్షణ పొందాలని సూచిస్తున్నారు నిపుణులు. హోమ్ లోన్ ఇన్సూరెన్స్ తో పాటు ప్రకృతి విపత్తులు, అగ్ని ప్రమాదాలు, దొంగతనాల వంటి వాటి నుంచి రక్షణ పొందాలంటే ఖచ్చితంగా మన కలల ఇంటికి బీమా చేయించాలని చెబుతున్నారు. మరి మార్కెట్ లో గృహ రుణ భీమాతో పాటు ఇంటికి చేయించాల్సిన బీమాల్లో ఏవేవి అందుబాటులో ఉన్నాయంటే..
యో తెలుసుకుందామా..
పైసా పైసా కూడబెట్టి, దానికి తోడు బ్యాంకు రుణం తీసుకుని చాలా మంది ఇంటిని కోనుగోలు చేస్తారు. మరి ఆ ఇంటిని జాగ్రత్తగా చూసుకోవడం ఎంతో అవసరం. అయితే ఇంటిని కొనగానే సరిపోదు, ఆ ఇంటికి పూర్తి రక్షణ కల్పించుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు రియల్ రంగ నిపుణులు. మన కలల ఇంటికి బీమాతో సెక్యూరిటీ కల్పించవచ్చని చెబుతున్నారు. ఇంటి కోసం రుణాన్ని తీసుకున్న ఇంటి యజమాని ప్రాణాలు కోల్పోయినా, శాశ్వత అంగవైకల్యం పొందినా, ప్రకృతి విపత్తులు, అగ్నిప్రమాదాలు, దొంగతనాల వంటిని సంభవించినప్పుడు ఆర్ధికంగా ఇంటి బీమా ఎంతో సహాయపడుతుంది. అందుకే హోమ్ లోన్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరు చేయించాలని నిపుణులు సూచిస్తున్నారు. వివిధ రకాల ప్రమాదాలను నుంచి మన ఇంటిని రక్షించుకునేందుకు మార్కెట్‌లో అనేక రకాల బీమా పాలసీలు అందుబాటులో ఉన్నాయి. మన అవసరం, పరిస్థితులను బట్టి మన ఇంటికి ఏది సరిపోతుందనుకుంటే దాన్ని ఎంచుకోవాలి.
మార్కెట్ లో అందుబోటులో ఉన్న పాలసీల్లో హోమ్ లోన్ బీమా ప్రదానమైంది. ఇంటి కొనుగోలు కోసం సాధ్యమైనంత వరకు అంతా బ్యాంకు నుంచి లోన్ తీసుకుంటారు. అందుకే సదరు ఇంటి రుణానికి సంబందించిన బీమా పాలసీ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పాలసీ వల్ల గృహ రుణం తీసుకున్న ఇంటి యజమానికి ఆకస్మిక మరణం సంబవించినా, ప్రమాదంలో అంగవైకల్యం చెందినా సదరు బీమా ద్వార మిగిలిన లోన్ మొత్తాన్ని ఇన్సూరెన్స్ సంస్థ చెల్లిస్తుంది. ఇప్పుడున్న హౌజ్ లోన్ పాలసీల ప్రీమియం మొత్తం లోన్ లో సుమారు ఒక శాతంగా ఉంది. కాబట్టి ఇంటి రుణానికి బీమా చేయించడం పెద్ద భారం ఏమీకాదని నిపుణులు చెబుతున్నారు.
ఆ తరువాత సమగ్ర ఇంటి పాలసీ ముఖ్యమైంది. ఇంటికి ఈ బీమా తీసుకుంటే ఇల్లు, అందులో సామగ్రి, ఇంట్లో నివసించేవారికి రక్షణ లభిస్తుంది. ప్రకృతి విపత్తులు, అగ్నిప్రమాదం, దొంగతనం వంటివి జరిగినప్పుడు ఈ పాలసీ పూర్తి లక్షణ కల్పిస్తుంది. ఇంటి విలువ, ప్రాంతం, బీమా మొత్తం వంటి అంశాల ఆధారంగా కవరేజ్ లభిస్తుంది. అయితే కావాలని చేసే నష్టానికి మాత్రం బీమా వర్తించదు. ఇంటి నిర్మాణంలో ఉపయోగించిన వస్తువుల్లో ఏమైనా తయారీ లోపం ఉండి నష్టం జరిగినా బీమా రాదని నిపుణులు చెబుతున్నారు.