poulomi avante poulomi avante

ఇల్లు నా హృదయానికి చాలా దగ్గర

  • ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు అద్నాన్ సమీ

బాలీవుడ్ ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు అద్నాన్ సమీ ఇల్లు విలాసవంతమే కాదు.. ఎంతగానో ఆహ్వానించతగ్గది కూడా. ఆ రంగుల పాలెట్ వాస్తవ వాతావరణాన్ని ఇనుమడింపజేస్తుంది. ఇవన్నీ ఆయన శ్రావ్యమైన స్వరాలు ఇవ్వడానికి ఎంతో దోహదం చేస్తాయి. అద్నాన్ ఎంచుకున్న రంగులు శాశ్వతమైన ఆకర్షణ కలిగి ఉంటాయి. మరి అద్నాన్ ఇల్లు ఎలా ఉందో ఓ లుక్కేద్దామా?

‘ఇల్లు నా హృదయానికి చాలా దగ్గరగా ఉంటుంది. నేను చాలా చక్కని ఎంతో సమయాన్ని నా భార్య రోయా సమీ ఖాన్, కుమార్తెతో కలిసి గడిపాను. నా కుమార్తె జాయ్ స్టిక్స్ తో ఆడటాన్ని చాలా బాగా ఇష్టపడుతుంది. అందుకే మా ఇంట్లో ప్రత్యేక గేమింగ్ జోన్ ఉంది. అంతేకాకుండా పలువురు ప్రముఖ గాయకులు, నటీనటుల ఫొటోలు కూడా మీరు చూస్తారు. నాతో కలిసి పనిచేసిన వారి ఫొటోలు మా ఇంటి గోడ మీద వేలాడుతూ ఉంటాయి. అది ఓ మధురమైన గోడ’ అని అద్నాన్ పేర్కొన్నారు. విలాసవంతమైన ఇల్లు అనే ఆలోచన వ్యక్తి వ్యక్తికీ భిన్నంగా ఉంటుంది. కానీ సమీకి ఇందులో స్పష్టమైన ఆలోచన ఉంది. డ్రీమ్ లగ్జరీ లాంజ్ అనేది లీనియర్ సోఫాలు, అందమైన కుర్చీలతోపాటు భారీ గాజుతో ఏర్పాటు చేసిన ఆధునిక స్థలంలా ఉండాలనేది ఆయన యోచన. ‘నా ఇల్లు చక్కదనం, మినిమలిస్ట్ ఫర్నిచర్ తో కూడిన ఉపకరణాలపైనే ఆచరణాత్మక దృష్టి పెడుతుంది. మా ఇంట్లో ను వాయిద్యాలు వాయించడానికి వీలుగా ప్రత్యేకంగా సంగీత గది ఉంది. కొన్నిసార్లు నేను ఇంట్లో పియానో వాయించడం ద్వారా నా అతిథులను అలరిస్తాను. పుస్తకాలు చదవడం కూడా నాకు చాలా ఇష్టం. మా ఇంట్లోని పలు అరల్లో బోలెడు పుస్తకాలు ఉంటాయి’ అని వివరించారు.

తెలుపు అనేది రంగు కంటే ఎక్కువగా అద్నాన్ భావిస్తారు. అది అద్భుతమైన మానసిక స్థితికి నిదర్శనంగా ఫీలవుతారు. శాంతి, ప్రశాంతత అనే అంశాల పాత్రను తీసుకుంటూ.. ఇంటీరియర్స్ లోని వైట్ మూడ్ బోర్డు అద్నాన్ జీవితంలోని మినిమలిస్ట్ ట్రెండ్ లలో భాగమైపోయింది. ‘రోయా. నేను చాలా ఆధునికమైన, చాలా క్లాసిక్ ఆర్కిటెక్చర్ ని చూశాం. మేం ఇద్దరం మా ఆధునిక దృక్పథాన్ని ప్రతిబింబించేలా.. అదే సమయంలో నిర్దిష్టమైన క్లాసిక్ అనుభూతిని కలిగి ఉండే ఇంటిని కలిగి ఉండాలని కోరుకున్నాం’ అని అద్నాన్ తెలిపారు. 10వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడంతస్తుల భవనంలో విలాసవంతమైన హౌసింగ్ ఫర్నిచర్ ను ఆర్మానీ వెర్సాచే, ఫెండి, నటుజ్జి డిజైన్ చేయగా.. కిచెన్ ను గాగ్గెనౌ రూపొందించింది. ‘నేను కొన్ని సూచనలు చేశాను. అలాగే చాలా ఆధునిక మెరుగులు ఉన్నాయి. డెకర్ కూడా క్లాసిక్ గానే ఉంటుంది. మా ఇంటి ఎంట్రన్స్ విలువైన రాళ్లు, ముత్యాలతో పాలరాయిపై చేతితో రూపొందించి ఉంటుంది’ అని వివరించారు. నిజానికి అద్నాన్ కు ఆగ్రాలోని క్లాసిక్ మార్బుల్ ఇన్లే పనితనాన్ని ఇష్టపడతారు. అందుకోసం ఆయన సంప్రదాయ కళాకారులను కూడా కష్టపడి వెతికి పట్టుకున్నారు. ఏడాదిన్నరపాటు కష్టపడి ఇంట్లో ఫ్లోరింగ్ పూర్తిచేయించారు.

‘ఎంట్రన్స్ వద్ద ఉన్న గోడపై ఖురాన్ శాసనాలు ఉన్న కాలిగ్రాఫిక్ పెయింటింగ్ ఉంటుంది. మేం కూడా పర్షియన్ తివాచీలను ఇష్టపడతాం. మా ఇంట్లో మీరు చాలా అంశాలు చూడొచ్చు. లాబీ గోడలో పలు చిత్రాలతో కూడిన తెల్లటి వాల్ పేపర్ ఉంటుంది. అన్ని మూడ్ లు, ఒరిజినల్ గోల్డ్ రికార్డుల ఫ్రేములు, మ్యూజిక్ మెమోరబుల్ గా అది ఉంటుంది’ అని పేర్కొన్నారు. ఇక ఒక పెద్ద గాజు స్లైడింగ్ తలుపు నాలుగు ప్రాంతాలను కలిగి ఉన్న గదిలోకి తీసుకెళ్తుంది. ఒక చోట గ్రాండ్ పియానో ఉంటే, మరో చోట పెద్ద డైనింగ్ టేబుల్.. ఒక దానిలో చిన్న బార్.. మరో దానిలో రెండు సెట్ల సోఫాలు ఉన్నాయి. అద్నాన్ కు తన పియానో అంటే చాలా ఇష్టం. ‘నేను ఇల్లు కట్టేటప్పుడే నా పియానో ఎక్కడ ఉండాలో నిర్ణయించుకున్నాను. అనంతరం దాని చుట్టూ ఉన్నవన్నీ అందుకు అనుగుణంగా డిజైన్ చేశాను’ అని వివరించారు. ఇక అద్నాన్ బెడ్ రూమ్ రొమాంటిక్ అనుభూతిని కలిగించేదిగా ఉంటుంది. అర్మానీ బెడ్, దాని చుట్టూ లేస్ కర్టెన్లు, మానసిక స్థితిని మార్చే అందమైన లైట్లుతోపాటు కీబోర్డు, కారోకే, కంప్యూటర్ అమర్చి ఉంటాయి. పడకగదికి ఇంతకంటే ఏం కావాలి?

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles