Categories: LATEST UPDATES

గృహ రుణాలలో 26% పెరుగుదల

భారతదేశంలో జనవరి-జూన్‌లో గృహ రుణాలలో 26% పెరుగుదల న‌మోదు అయ్యింది. రిజ‌ర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును పెంచ‌క‌పోవ‌డంతో బ్యాంకులు 7శాతం కంటే త‌క్కువ వ‌డ్డీకే గృహ‌రుణాల్ని అందిస్తున్నాయి. 46 శాతం మంది బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకునేందుకు ముందుకొచ్చారు. ఆస్తి మీద రుణం తీసుకునే అంశంలోనూ 20 శాతం పెరుగుద‌ల న‌మోదు కావ‌డం గ‌మ‌నార్హం. దేశంలోని వివిధ రాష్ట్ర ప్ర‌భుత్వాలు అంద‌జేస్తున్న ప్ర‌త్యేక ప్రోత్సాహాకాలు, త‌క్కువ వ‌డ్డీ రేట్లు, ఆయా న‌గ‌రాల్లో అభివృద్ది చెందుతున్న మౌలిక స‌దుపాయాల కార‌ణంగా ఇళ్ల‌ను కొనేవారి శాతం అధిక‌మైంది.

దాదాపు యాభై శాతం మంది 15 ఏళ్ల కంటే త‌క్కువ రుణ‌వ్య‌వ‌ధిని ఎంచుకున్నారు. అంటే, గృహ‌రుణాన్ని వీలైనంత త్వ‌రగా క‌ట్టేసేందుకు అధిక శాతం కొనుగోలుదారులు భావిస్తున్నార‌ని దీన్ని బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది. కొన్ని ప్ర‌భుత్వరంగ సంస్థ బ్యాంకులు సాధార‌ణంగా గృహ‌రుణం చెల్లింపు కోసం 25 నుంచి 30 ఏళ్ల దాకా గ‌డువునిస్తున్నాయి. అయిన‌ప్ప‌టికీ, రుణాన్ని త్వ‌రగా తీర్చేయాల‌నే ఆలోచ‌న‌ల‌తో ఇళ్ల కొనుగోలుదారులు ఉన్న‌ట్లు స‌మాచారం.

This website uses cookies.