సమకాలీన రీతిలో కలల గృహం ఉండాలని.. సొగసైన ఇంటీరియర్స్‌తో అలంకరించాలని నటి ప్రియా బెనర్జీ భావిస్తోంది. తెలుగులో కిస్ సినిమాలో కనిపించిన ఈ ముద్దుగుమ్మ తన డ్రీమ్ హోమ్ గురించి రియల్ ఎస్టేట్ గురుకి ప్రత్యేకంగా వివరించింది. వెబ్‌లో అనేక ప్రముఖ కార్యక్రమాలను అందించి తన ప్రత్యేకతను చాటిచెప్పిన ప్రియా డ్రీమ్ హోమ్ గురించి స్పష్టతతో ఉన్నది. ఇంటి చుట్టూ ఎలాంటి గజిబిజి లేకుండా.. ఇండోర్ హీటెడ్ స్విమ్మింగ్ పూల్, ఆధునిక హోమ్ థియేటర్ వంటివి ఏర్పాటు చేసుకుని ఆనందంగా నివసించాలని కోరుకుంటున్నది. ఇంకా పలు ఆసక్తికరమైన ముచ్చట్లు ఆమె మాటల్లోనే..
ప్రేమ, రక్తం మరియు చెమటకు ప్రతీకగా సొంతిల్లు నిలుస్తుందని చెప్పొచ్చు. అందుకే, ఇది పూర్తి భావోద్వేగంతో నిండి ఉంటుంది. గదులు వీలైనంత విశాలంగా ఉండాలి. క్రమం తప్పకుండా ఈత కొట్టడం మరియు ఇంట్లో నా కుటుంబం మరియు స్నేహితులతో కలిసి రిక్లయినర్లలో కూర్చుని పెద్ద స్క్రీన్‌లో సినిమాలు చూడటం ఇష్టపడతాను. వ్యక్తిగత ఇండోర్ స్విమ్మింగ్ పూల్ మరియు థియేటర్ ఉంటే ఎంత బాగుంటుంది? ఎల్లప్పుడూ నేను విలాసవంతమైన పెంట్ హౌజ్‌లో నివసించాలని ఉంది. అప్పుడే ప్రకృతిని కూడా ఆస్వాదించొచ్చు.పైగా, మనకు నచ్చిన రీతిలో టెర్రస్ గార్డెన్ డిజైన్ చేసుకోవచ్చు. పూర్తి సౌకర్యాలు ఉండి, చక్కటి అనుభూతినిచ్చే కలల గృహంలో నిర్మించే టెర్రస్ గార్డెన్‌లో ఎక్కువ సమయం గడుపుతాను. మనమే సృష్టించిన ఒక అందమైన ప్రాంతంలో సమయం గడపటం ఎంత ఆనందంగా ఉంటుంది కదూ? అక్కడే యోగా చేయడం, ఇష్టమైన పుస్తకాన్ని చదవడాన్ని ఆస్వాదిస్తాను.
నేను నివసిస్తున్న ముంబైలోనే నా కలల నివాసాన్ని నిర్మించుకుంటాను. ఇక్కడ రోజంతా పని చేయడం మరియు విలాసవంతమైన ఇంటికి తిరిగి రావడం ఆకర్షణీయంగా ఉంటుంది కదూ? నా ఆలోచనలకు తగ్గట్టుగా డిజైన్ చేసిన వంట గది ఉండాలి. ఇంటీరియర్స్ మొత్తం నేను స్వయంగా డిజైన్ చేయడాన్ని ఇష్టపడతాను. ఒక విశాలమైన డైనింగ్ రూముతో పాటు కళాఖండాలు మరియు సాంస్కృతిక పెయింటింగ్‌లతో నిండిన విశాలమైన గది ఉండాలి.
మరి, మీరు కూడా విలాసవంతమైన ఇంటిని డిజైన్ చేసుకోవాలని భావిస్తుంటే మాత్రం.. తప్పకుండా నటి ప్రియా బెనర్జీ డ్రీమ్ హౌస్‌ని డీకోడింగ్ చేయాల్సిందే.
This website uses cookies.