Categories: LATEST UPDATES

న్యాయం కోసం సాహితీ బాధితుల హోమం

సాహితీ ఇన్ ఫ్రా టెక్ లో పెట్టుబడి పెట్టి నష్టపోయిన బాధితులు ఆదివారం మాదాపూర్ లో హోమం నిర్వహించారు. తమకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వం జోక్యం చేసుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం చేపట్టారు. ఫ్లాట్ల అమ్మకం పేరుతో కొనుగోలుదారుల నుంచి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేసిన సాహితీ సంస్థ వారికి ప్రాపర్టీ అప్పగించకుండా నిలువునా ముంచేసింది.

దాదాపు 1500 మంది నుంచి సాహితీ ఎండీ బి.లక్ష్మీనారాయణ దాదాపు రూ.400 కోట్లు వసూలు చేసి ఇతర వ్యాపారాలకు వాటిని మళ్లించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఈడీ దర్యాప్తు జరుపుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తమకు న్యాయం చేయాలంటూ సాహితీ బాధితులు హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 150 మంది పాల్గొన్నారు.

This website uses cookies.