అర్బన్ డెవలప్ మెంట్ అథార్టీ ప్రాంతంలో సొంత స్థలం కలిగి ఉన్న పేదలకు ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేయనుందని ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేశ్ వెల్లడించారు. ఏపీలో 21.30 లక్షల ఇళ్లు నిర్మితమవుతున్నాయని.. దేశవ్యాప్తంగా మంజూరైన ఇళ్లలో ఒక్క ఏపీకే 20 శాతం ఇళ్లు వచ్చాయని పేర్కొన్నారు.
అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లోని జగనన్న కాలనీ లేఔట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. రోడ్ల నిర్మాణంతోపాటు నీటి సరఫరా, కరెంటు లైన్ల ఏర్పాటు వంటి పనులను ప్రాధాన్యతతో చేపట్టాలని ఆదేశించారు.