Categories: LATEST UPDATES

ఇళ్లను లేపుదాం చలోచలో

  • వానాకాల బాధలు తప్పించుకోవడానికి హౌస్ లిఫ్టింగ్
  • పునాదులతో సహా ఇంటిని పైకి లేపుతున్న సంస్థలు

వర్షాకాలం వచ్చిందంటే చాలు.. లోతట్టు ప్రాంతాల్లో ఉండేవారి బాధలు వర్ణనాతీతం. ఇళ్లలోకి నీళ్లు రావడంతో చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఇల్లు వదిలిపెట్టి వెళ్లలేరు.. పోనీ ఇది అమ్మేసి, కొత్త ఇల్లు కొనుక్కుందామంటే అంత భరించే పరిస్థితి చాలామందికి ఉండదు. ఈ నేపథ్యంలో పలువురు తమ ఇంటినే పైకి లేపడానికి మొగ్గు చూపుతున్నారు. ఇంటిని ఉన్నచోటునే కాస్త పైకి లేపే సంస్థలను ఆశ్రయిస్తున్నారు.

ఇటీవల కాలంలో హౌస్ లిఫ్టింగ్ సంస్థలకు బాగా గిరాకీ పెరిగింది. కొచ్చిలోని పలు ప్రాంతాలకు చెందిన ఇళ్ల యజమానులు ఆయా సంస్థలకు ఫోన్ చేసి వివరాలు ఆరా తీస్తున్నారు. నగరంలో కొత్త ప్లాటో, ఇల్లో కొనుక్కోవడం కంటే ఇంటిని పైకి లేపించుకోవడం చాలా తక్కువ ఖర్చుతో అయిపోతుండటంతో చాలామంది దీనికే మొగ్గు చూపుతున్నారు. కొత్త ఇంటికి వెచ్చించే మొత్తం పావు వంతుతోనే ఈ పని పూర్తి అవుతుండటంతో చాలామంది దీనిపై ఆసక్తి చూపుతున్నారు.

పలు సంస్థలు ఇంటి సామర్థ్యం, స్టక్చర్, అంతస్తుల ఆధారంగా రకరకాల టెక్నాలజీతో హౌస్ లిఫ్టింగ్ ప్రక్రియ చేపడుతున్నాయి. తొలుత ఈ విధానంలో పునాదుల వరకు మట్టి తవ్వి, జాకీలు లేదా హైడ్రాలిక్ వ్యవస్థ ద్వారా ఇంటిని కావాల్సినంద మేర పైకి ఎత్తుతారు. అనంతరం కింద కొత్త పునాది వేసి పాత పునాదితో కలిపి ఫిక్స్ చేస్తారు. దీంతో ఇల్లు అంతమేర పైకి వచ్చి, వర్షాకాలంలో వరద ముంపు బారిన పడకుండా ఉంటుంది.

This website uses cookies.