Categories: LATEST UPDATES

రియల్ డిజిటల్ మార్కెటింగ్

కొనుగోలుదారులు ప్రస్తుతం ఓ ఉత్పత్తికి సంబంధించి మరింత తెలుసుకోవాలని కోరుకుంటున్నారు. తమ సందేహాలకు తక్షణమే సమాధానాలు కావాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో డిజిటల్ మార్కెటింగ్ పాత్ర కీలకంగా మారింది. తక్కువ వ్యయంతో చాలామందికి రీచ్ అయ్యే అవకాశం ఉండటంతో చాలా కంపెనీలు సైతం తమ మార్కెట్ స్ట్రాటజీని డిజిటల్ వైపు తిప్పుతున్నాయి.

గత పదేళ్లలో డిజిటల్ లో అడ్వర్టైజింగ్ మార్కెట్ కు వెచ్చించే మొత్తం ఏకంగా రూ.2వేల కోట్ల నుంచి రూ.36 వేల కోట్లకు పెరగడమే ఇందుకు నిదర్శనం. గత కొంత కాలంగా డిజిటల్ మార్కెటింగ్ పెరుగుతూ వస్తోంది. అయితే, ఇది రియల్ ఎస్టేట్, ఇతర రంగాల్లో వేర్వేరుగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ.. స్థూలంగా మాత్రం డిజిటల్ మార్కెటింగ్ పరుగులు తీస్తోందని చెప్పక తప్పదు. కొనుగోలుదారుల సందేహాలకు చాట్ బాట్ వంటి ద్వారా అప్పటికప్పుడు సమాధానాలు తెలిసే అవకాశం ఉండటం వంటివి డిజిటల్ మార్కెటింగ్ కు సానుకూలంగా ఉన్నాయి.

డిజిటల్ మార్కెటింగ్ అన్నింటికీ సరిపోదనే వాదనలూ వినిపిస్తున్నాయి. కేవలం నిర్దేశిత వ్యక్తులకు మాత్రమే అది చేరుతుందని.. అందుబాటు ధరలోని ప్రాజెక్టులతోపాటు మధ్యస్త ప్రాజెక్టులకు డిజిటల్ మార్కెటింగ్, ఏఆర్, వీఆర్ వంటివి సరిపోవని కొందరు అంటున్నారు. లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాపర్టీలతోపాటు వాణిజ్య ప్రాపర్టీలు ఆన్ లైన్ లో ఎక్కువ మందికి చేరతాయని.. అందువల్ల బిల్డర్లు కూడా వివిధ రకాల కేటగిరీలకు అనుగుణంగా వేర్వేరు మార్కెటింగ్ వ్యూహాలు రూపొందించుకోవాలని సూచిస్తున్నారు.

This website uses cookies.