ప్రీలాంచ్ మోసానికి పాల్పడిన భువనతేజ ఇన్ఫ్రా ఎండీ చక్కా వెంకటసుబ్రమణ్యంతో పాటు ఫణిభూషణ్రావు, రాజ్కుమార్లను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే, హ్యాపీ హోమ్స్ 2 ప్రాజెక్టులో దేవాస్ ఇన్ఫ్రా అనే మార్కెటింగ్ సంస్థకు చెందిన ఎన్ సూర్యనారాయణరెడ్డి సుమారు వంద ఫ్లాట్ల దాకా విక్రయించాడని సమాచారం. ఇందులో సుమారు 30 మంది వంద శాతం సొమ్ము చెల్లించారని సమాచారం. ఇందులో సింగరేణికి చెందిన ఉద్యోగులు, చిన్న చిన్న వృత్తుల్లో ఉన్న సామాన్యులు ఉన్నారని తెలిసింది.
సదరు ఎన్ సూర్యనారాయణరెడ్డి జడ్చర్లలో సన్నిధి ఆగ్రోఫామ్స్ పేరిట ఫామ్ ల్యాండ్ విక్రయించాడని, మహబూబ్నగర్లో అపార్టుమెంట్లను సైతం ఆరంభించాడని సమాచారం. రెరా అనుమతి తీసుకుని ప్రాజెక్టును కడితే ఎవరికీ ఇబ్బంది ఉండదు. కాకపోతే, ప్రీలాంచుల్లో ఫామ్ ల్యాండ్లు, ఫ్లాట్లను మధ్యతరగతి ప్రజలకు అంటగడితేనే అసలు సమస్య. కాబట్టి, ఇలాంటి ప్రీలాంచులపై ప్రభుత్వం నజర్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
This website uses cookies.