ప్రీలాంచ్ ఫ్రాడ్‌స్టర్ల పుణ్యమా అంటూ వ్యూహాత్మక ప్రాంతాల్లో ఉన్న ఖరీదైన భూములు కాస్త లిటిగేషన్‌లో పడుతున్నాయి. ఆయా భూముల్లో నిర్మాణాలు ఆరంభం కాక.. అందులో ఏర్పడిన సమస్యలు ఎవరు పరిష్కరిస్తారో తెలియక.. కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదాహరణకు కొల్లూరును తీసుకుంటే.. ఒక అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ సంస్థ హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా ప్రీలాంచ్ వ్యాపారానికి శ్రీకారం చుట్టి.. కొల్లూరులో వందలాది మందితో పెట్టుబడి పెట్టించింది. కానీ, ఆతర్వాత ఆ ప్రాజెక్టు ఆరంభం కాలేదు. మరో సంస్థ కూడా సుమారు ఐదు వందల మంది బయ్యర్ల నుంచి ప్రీలాంచ్‌లో సొమ్ము వసూలు చేసి.. నేటికీ ప్రాజెక్టును ప్రారంభించలేదు.
వెలిమలలో కూడా మరో రియల్టర్ ఇలాగే చేశాడు. మొత్తానికి, ప్రీలాంచ్ వ్యాపారులు హైదరాబాద్ రియాల్టీలో సమస్యల్ని సృష్టిస్తూ కొనుగోలుదారుల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇలాంటి ప్రాజెక్టుల సమచారాన్ని తెలంగాణ రెరా అథారిటీ సేకరించి.. ఆయా సమస్యల్ని పరిష్కరించాలి. ఒకవేళ రెరా పరిష్కరించకపోతే, రియాల్టీలో నెలకొంటున్న మోసాలు, వారికి దృష్టికొస్తున్న సమస్యలపై ప్రభుత్వానికి ఒక నివేదిక పంపాలి. అప్పుడే, కొత్త ప్రభుత్వం ప్రీలాంచ్ బాధితులకు న్యాయం చేయడానికి వీలు కలుగుతుంది. లేకపోతే, గత ప్రభుత్వ హయంలో జరిగిన మోసాలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద పడే అవకాశముంది.
This website uses cookies.