సొంతిల్లు కొనుక్కునే క్రమంలో చాలామంది నిపుణులతో ఆ ఇంటిని పరీక్షింపచేయరు. పొరపాటున ఏమైనా సమస్యలు తలెత్తితే లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. పాత ఇల్లు కొనే క్రమంలో.. ఆయా ఇంటి పరిస్థితి ఎలా ఉంది? వాటికి మరమ్మతులు చేయడానికి ఎంత ఖర్చు పెట్టాల్సి ఉంటుంది? ఇలాంటి అంశాల్ని తెలుసుకోవాలంటే.. ఇంటి కొనుగోలు కంటే ముందే ఇంటిని పూర్తిగా ఇన్ స్పెక్షన్ చేయించాలి. అప్పుడే, అందులో ఎన్ని సమస్యలున్నాయో ఇట్టే తెలిసిపోతుంది. మరి, ఇంటిని తనిఖీ చేసేదెవరు? అందులో సమస్యలు చెప్పేదెవరు?
కొన్ని సందర్భాల్లో సుమారు రెండు వేల చదరపు అడుగుల ఇంటిలో.. దాదాపు 130 రకాల సమస్యలు ఉండే అవకాశముందని నిపుణులు అంటున్నారు. వాటన్నింటినీ మరమ్మతులు చేయాలంటే రూ.1.8 లక్షల ఖర్చు అవుతుంది. కొత్త ఇంట్లో సమస్యలేం ఉంటాయి? దీనికి ఇన్ స్పెక్షన్ ఎందుకు అని భావిస్తారు. అలాగే ఈ ఇంట్లో చాలాకాలం నుంచి ఉంటున్నారు కదా? ఇక సమస్య ఏం ఉంటుంది అని మరికొందరు భావిస్తారు. కానీ ఇంటి ఇన్ స్పెక్షన్ అత్యంత అవసరమనే విషయాన్ని గుర్తించాలి.
నిపుణులతో కూడిన బృందం మీ ఇంటిని పూర్తిగా పరిశీలిస్తారు. ప్రత్యేకమైన పరికరాలతో, ఆధునిక సాంకేతికతను ఉపయోగించి ఇంట్లోని ప్రతి అంగుళాన్ని నిశితంగా గమనిస్తారు. ఫ్లోరింగ్ నుంచి సీలింగ్ వరకూ అంతా పరిశీలిస్తారు. ఆధునిక సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ ఉపయోగించి లోపాలు ఏమైనా ఉన్నాయోమే అనే విషయాన్ని కచ్చితంగా కనుక్కుంటారు. అనంతరం అన్నింటినీ క్రోడీకరించి ఎక్కడెక్కడ ఏయే లోపాలున్నాయో సవివర నివేదిక తయారు చేస్తారు. వాటిని ఎలా పరిష్కరించాలో కూడా సూచనలు చేస్తారు.
బాత్ రూమ్, స్టోర్ రూమ్, లివింగ్ రూమ్, స్టాఫ్ క్వార్టర్స్, బెడ్ రూమ్, లాబీ, డైనింగ్ రూమ్, బేస్ మెంట్స్, కారిడార్స్, అనుసంధాన నిర్మాణాలు (ఏమైనా ఉంటే), కిచెన్, రైలింగ్స్, బాల్కనీలు, గోడలు, సీలింగ్స్, ఫ్లోర్స్, డోర్స్ అండ్ ఫ్రేమ్స్, కేబినెట్లు, కిటికీలు, ప్లంబింగ్, వెంటిలేషన్, నీటి సరఫరాల, ప్రెషర్, లీకేజీలు, ఎలక్ట్రికల్స్ అండ్ వైరింగ్, ఎగ్జాస్ట్ సిస్టమ్స్ తదితరాల సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలిస్తారు.
ఇంటి నిర్మాణం సక్రమంగా ఉంటేనే అందులో నివసించేవారు సురక్షితంగా ఉంటారు.
అందువల్ల మీరు ఇల్లు కొనాలనుకుంటున్న ప్రదేశం సరిగా ఉందా లేదా అనేది నిర్ధారించుకోవడానికి భద్రతా తనిఖీలు చాలా ముఖ్యమైనవి. పది కాలాలపాటు పదిలంగా ఉండాల్సిన ఇంటి విషయంలో ఆ మాత్రం జాగ్రత్తలు తప్పనిసరి. మరి మన ఇంటిని అన్ని విధాలా పూర్తి స్థాయిలో తనిఖీలు చేసి సక్రమైన నివేదిక ఇచ్చే సర్వీస్ ప్రొవైడర్ ను ఎలా ఎంచుకోవాలి? చాలా సింపుల్.. www.propchk.com చూడండి. మీ ఇంటి తనిఖీ కోసం పూర్తి గైడ్ అందుబాటులో ఉంది. లేదా వారి యాప్ ను డౌన్ లోడ్ చేసుకోండి. కస్టమర్ కి ఏం కావాలనే అంశంపైనే PropChk దృష్టి పెడుతుంది.
This website uses cookies.