Categories: TOP STORIES

ఎస్ఎంఆర్‌లో కొంటే ఎంత ప్ర‌యోజ‌నం?

హైద‌రాబాద్‌లో ఎస్ఎంఆర్ వంటి నిర్మాణ సంస్థ‌లు.. అడ్వాన్స్ స్టేజీలో స‌బ్ వెన్ష‌న్ స్కీమును ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. మ‌రి, దీని వ‌ల్ల కొనుగోలుదారుల‌కు క‌లిగే ప్ర‌యోజ‌నం ఏమిటి? రెజ్ న్యూస్ అందిస్తున్న విశ్లేష‌ణాత్మ‌క క‌థ‌నం మీకోసం.

ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ టీఎస్‌పీఏ జంక్ష‌న్‌లోని కిస్మ‌త్‌పురాలో ఎస్ఎంఆర్ విన‌య్ బౌల్డ‌ర్ వుడ్స్ ప్రాజెక్టును నిర్మిస్తోంది. మొత్తం ఎనిమిది ఎక‌రాల్లో రెండు ట‌వ‌ర్ల‌ను క‌డుతోంది. ఇందులో వ‌చ్చే ఫ్లాట్ల సంఖ్య సుమారు 583 దాకా ఉంటాయి. ఎనిమిది ఎక‌రాలు ల‌భిస్తే వెయ్యికి పైగా ఫ్లాట్ల‌ను క‌ట్టే సంస్కృతి ఆరంభ‌మైన హైద‌రాబాద్ రియ‌ల్ రంగంలో.. ఇంత త‌క్కువ సంఖ్య‌లో ఫ్లాట్లు రావ‌డ‌మంటే ఆనందించాల్సిందే. ఈ సంస్థ రెండు ప‌డ‌క గ‌దుల ఫ్లాట్ విస్తీర్ణాన్ని 1340 చ‌ద‌ర‌పు అడుగుల్లో క‌డుతోంది. ధ‌ర చ‌ద‌ర‌పు అడుక్కీ రూ. 6500 చెబుతోంది. ఈ రేటు చొప్పున ఫ్లాట్ కొంటే.. అమినిటీస్‌, కారు పార్కింగును లెక్కిస్తే.. తుది ధ‌ర సుమారు కోటి రూపాయ‌లు అవుతుంది. ఆరంభంలో బ‌య్య‌ర్లు రూ.20 ల‌క్ష‌లు క‌డితే చాలు.. ఏడాది దాకా వ‌డ్డీ క‌ట్ట‌క్క‌ర్లేదు. అంటే, సుమారు రూ. 6 ల‌క్ష‌ల వడ్డీ భారాన్ని సంస్థే భ‌రిస్తుంది. ఈ మొత్తాన్ని మిన‌హాయిస్తే.. గృహ‌ప్ర‌వేశం చేసిన త‌ర్వాత మీరు చెల్లించే నెల‌స‌రి ఈఎంఐ కేవ‌లం రూ.57 వేల దాకా అవుతుంది. లేక‌పోతే, రూ.80 ల‌క్ష‌ల రుణంపై నెల‌స‌రి వ‌డ్డీ ఎంతలేద‌న్నా రూ.62 వేలు దాకా అవుతుంద‌ని గుర్తుంచుకోండి.

ఇక్క‌డ గ‌మ‌నించాల్సిన అంశం ఏమిటంటే.. ఓ మూడు నుంచి నాలుగేళ్ల‌లోపు.. టీఎస్పీఏ జంక్షన్, కిస్మత్ పూర్ వంటి ఏరియాల్లో మెట్రో రైల్ స్టేషన్, బుద్వేల్‌లోని నెక్స్ట్ జ‌న‌రేష‌న్ ఐటీ పార్కు.. అందులో కొత్త‌గా ఏర్ప‌డే ఐటీ కంపెనీలు.. చేరువ‌లో గ‌ల జంట జ‌లాశ‌యాలు టూరిస్టు డెస్టినేష‌న్‌గా అవ‌త‌ర‌ణ‌.. టీఎస్‌పీఏ జంక్ష‌న్ నుంచి కొల్లూరు దాకా డెవ‌ల‌ప్ చేస్తున్న సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్‌.. మ‌ధ్య‌లో ఆహ్లాద‌క‌ర‌మైన ప్రాంతాల అభివృద్ధి.. ఇలాంటి అనేక అంశాల కార‌ణంగా ఈ ప్రాంతంలో ఫ్లాట్ల విలువ‌లు రెట్టింప‌య్యే ఆస్కార‌ముంది. ఎస్ఎంఆర్ బౌల్డర్ వుడ్స్ లో డబుల్ బెడ్ రూం ఫ్లాటు కొనేందుకు.. జేబులో నుంచి పెట్టే సొమ్ము రూ. 20 ల‌క్ష‌లు మాత్ర‌మే. త‌ర్వాత జీఎస్టీ, రిజిస్ట్రేష‌న్‌, ఇంటీరియ‌ర్స్ వంటి వాటికి మ‌రో రూ.20 ల‌క్ష‌లు అవుతుంది. ప్రాజెక్టులోకి మీరు గృహ‌ప్ర‌వేశం చేశాక‌.. నెల‌స‌రి బ్యాంకు రుణం 57 వేల‌ను లెక్కిస్తే.. నాలుగేళ్ల‌లో సుమారు రూ. 25 ల‌క్ష‌ల దాకా అవుతుంది. అంటే, మీరు పెట్టేది రూ.65 ల‌క్ష‌ల సొమ్ము మాత్ర‌మే. కాక‌పోతే, ఈ నాలుగేళ్ల‌లో మీ ఫ్లాటు విలువ ఎంత‌లేద‌న్నా మూడింత‌లు అవుతుందనే విష‌యాన్ని మ‌ర్చిపోవ‌ద్దు. మీరు ఎస్ఎంఆర్ ప్ర‌వేశ‌పెట్టిన స్మార్ట్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీములో ఫ్లాట్ల‌ను కొనుగోలు చేస్తే.. మీరు సొంతింటి ఆనందాన్ని ఆస్వాదించ‌డంతో పాటు.. మంచి అప్రిసీయేష‌న్‌ని కూడా అందుకోవ‌చ్చ‌ని గుర్తుంచుకోండి.

అంత ఎలా పెరుగుతుందా?

ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ సంస్థ బండ్ల‌గూడ‌లో నాణ్య‌మైన గేటెడ్ క‌మ్యూనిటీల స‌ముదాయాల్ని నిర్మించ‌డానికి ప్ర‌ణాళిక‌ల్ని ర‌చించింది. అంటే, ఒకే నాలుగు విభిన్న‌మైన గేటెడ్ క‌మ్యూనిటీల‌కు ఇక్క‌డ అభివృద్ధి చేస్తోంది. ప్ర‌తి ప్రాజెక్టును విడివిడిగా తీర్చిదిద్ది.. అన్నింటికీ క‌లిపి ఓకే ప్ర‌ధాన ర‌హ‌దారిని ఏర్పాటు చేసింది. ప్ర‌తి క‌మ్యూనిటీకి విడిగా ప్ర‌వేశ మార్గం, భ‌ద్ర‌త స‌దుపాయాలుంటాయి. అన్ని క‌మ్యూనిటీల‌కు క‌లిపి ప్ర‌త్యేకంగా ఒక క్రికెట్ గ్రౌండ్ స‌దుపాయాన్ని ఏర్పాటు చేసింది. నాలుగేళ్ల క్రితం ఇందులో అనేక మంది చ‌ద‌ర‌పు అడుక్కీ రూ.2700- 2,800కే ఫ్లాట్ల‌ను కొనుగోలు చేశారు. ఇప్పుడేమో ఫ్లాట్ ధ‌ర సుమారు రూ.6500కు చేరింది. కాబ‌ట్టి, వ‌చ్చే నాలుగేళ్ల‌లో కూడా రేటు ఇదేవిధంగా రెట్టింప‌య్యే వీలుంది. కాబ‌ట్టి, మీరు ఏమాత్రం ఆల‌స్యం చేయ‌కుండా.. ఎస్ఎంఆర్ హోల్డింగ్స్‌లో మీకు అన్నివిధాల న‌ప్పే ఫ్లాటును సొంతం చేసుకోండి.

* ఫ్లాట్ తుది ధ‌ర‌, వ‌డ్డీ రేటు, రుణ వ్య‌వ‌ధి, ఆరంభంలో చెల్లించే మొత్తం బ‌ట్టి.. నెల‌స‌రి ఈఎంఐ మారుతుంద‌ని గుర్తుంచుకోండి.

This website uses cookies.