రెజ్ న్యూస్, హైదరాబాద్: హెచ్ఎండీఏ తలపెట్టిన వేలానికి సంబంధించిన ప్రీ బిడ్ సమావేశాలకు మంచి ఆదరణ లభిస్తోంది. బేగంపేట్ టూరిజం ప్లాజా, గీతం కాలేజీలో జరిగిన మూడు మీటింగులకు ఔత్సాహికుల నుంచి చక్కటి స్పందన లభించింది. రంగారెడ్డి జిల్లాలో 13 ప్లాట్లు, సంగారెడ్డిలోని 17 ప్లాట్లు, మేడ్చల్ మల్కాజిగిరిలోని ఎనిమిది ప్లాట్లకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారులు సమావేశంలో వివరించారు.
రంగారెడ్డి జిల్లాలో 13 ప్లాట్లను హెచ్ఎండీఏ విక్రయించడానికి సమాయత్తం అవుతోంది. అమీన్ పూర్, ఇస్నాపూర్, రామచంద్రాపురం పరిసర ప్రాంతాల్లో ల్యాండ్ పార్సిళ్లు ఉండటంతో ఔత్సాహికులు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుండటం విశేషం. ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)కు సమీపంలో ప్లాట్లు ఉండటంతో బయ్యర్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఘట్ కేసర్ సమీపంలోని కొర్రెముల, బాచుపల్లి.. కూకట్ పల్లి సమీపంలోని మూసాపేట్, గండి మైసమ్మ సమీపంలోని బౌరంపేట్, కుత్బుల్లాపూర్ సమీపంలోని సూరారం ప్రాంతాల్లో ఉన్న ఎనిమిది ప్లాట్లను హెచ్ఎండీఏ వేలం వేయడానికి రంగం సిద్ధం చేస్తోంది.
* ఈ మూడు సమావేశాలు కలిపి నాలుగు వందలకు పైగా ఔత్సాహికులు పాల్గొనడం విశేషం. వీరితో పాటు పలువురు రియల్టర్లు, రియాల్టీ ఛానల్ పార్ట్‌నర్లు, వ్యాపారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఔత్సాహికుల ప్రశ్నలకు, వారి సందేహాలకు హెచ్ఎండిఏ ఉన్నతాధికారులు, రెవెన్యూ అధికారులు సమాధానాలిచ్చారు. ఈ ప్రీ బిడ్ సమావేశాల్లో హెచ్ఎండిఏ సెక్రెటరీ పి.చంద్రయ్య, హెచ్ఎండిఏ ఎస్టేట్ ఆఫీసర్ (ఈవో) గంగాధర్, హెచ్ఎండిఏ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు కె.చంద్రారెడ్డి, శ్రీనివాస్, హెచ్ఎండిఏ చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ (సీపీవో) గంగాధర్, పలువురు తహసీల్దార్లు, సర్వేయర్లు, గిర్ధవార్లు పాల్గొన్నారు.
This website uses cookies.