Categories: Rera

రెరాలో ప్రాజెక్టు రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి?

రియల్ ఎస్టేట్ రంగంలో ప్రస్తుతం రెరాది కీలక పాత్ర. ఈ రంగంలో పారదర్శకత కోసం తీసుకొచ్చిన ఈ చట్టం కొనుగోలుదారులకు వరంగా మారింది. ప్రతి బిల్డర్ తమ ప్రాజెక్టును ఇందులో నమోదు చేసుకోవాల్సిందే. దీనివల్ల కొనుగోలుదారులకు ఆ ప్రాజెక్టు పూర్తి వివరాలు తెలియడమే కాకుండా తాము పెట్టే పెట్టుబడికి భరోసా ఉంటుంది. మరి రెరాలో ప్రాజెక్టును ఎలా నమోదు చేసుకోవాలి? ఇందుకు ఏయే వివరాలను బిల్డర్ సమర్పించాలో చూద్దామా?

  • ప్రమోటర్ పాన్ కార్డు కాపీ
  • మూడేళ్లకు సంబంధించిన ఆడిటింగ్ చేసిన లాభనష్టాల ఖాతా, బ్యాలెన్స్ షీట్, నగదు ప్రవాహ స్టేట్ మెంట్, డైరెక్టర్స్ రిపోర్ట్, ఆడిటర్స్ రిపోర్ట్స్ తో కూడిన వార్షిక నివేదిక* ఆ ప్రాజెక్టులో అందుబాటులో
  • ఉన్న ఓపెన్ పార్కింగ్ ఏరియాలు, కవర్ చేసిన పార్కింగ్ ప్రాంతాల సంఖ్య
  • ప్రాజెక్టు చేపట్టిన భూమికి సంబంధించిన అన్ని చట్టబద్ధమైన డాక్యుమెంట్లు
  • సదరు భూమికి సంబంధించి ఏదైనా హక్కులు, టైటిల్, బకాయిలు, వ్యాజ్యం వంటివి ఏవైనా ఉన్నాయో తెలియజేసే వివరాలతో కూడిన ఈసీ
  • ఒకవేళ ప్రమోటర్ సదరు భూమికి యజమాని కాని పక్షంలో ఆ భూమి యజమాని సమ్మతి వివరాలు, ప్రమోటర్, భూ యజమాని మధ్య కుదిరిన డెవలప్ మెంట్ అగ్రిమెంట్ కాపీ, ఇతర ఒప్పంద పత్రాలు
  • ప్రమోటర్ పేరు, ఫొటో, సంప్రదింపు వివరాలు, చిరునామా, సంస్థ చైర్మన్, భాగస్వాములు, డైరెక్టర్లు, ఇతర అధీకృత వ్యక్తుల వివరాలు
  • ఈ వివరాలన్నింటితో ప్రాజెక్టు రిజిస్ట్రేషన్ కోసం ఫారం-ఏలో రెరాకు రాతపూర్వకంగా దరఖాస్తు చేయాలి.
  • దరఖాస్తుతో పాటు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. డీడీ లేదా బ్యాంకర్స్ చెక్ ద్వారా దీనిని చెల్లించాలి.
  • గ్రూప్ హౌసింగ్ ప్రాజెక్టు విషయంలో వెయ్యి చదరపు మీటర్ల లోపు నిర్మాణాలకు చదరపు మీటరకు రూ.5 చొప్పున, వెయ్యి అంతకంటే ఎక్కువ చదరపు మీటర్ల నిర్మాణాలకు చదరపు మీటరుకు రూ.10 చొప్పున.. గరిష్టంగా రూ.5 లక్షల వరకు చెల్లించాలి.
  • ఇక మిక్స్ డ్ డెవలప్ మెంట్ (రెసిడెన్షియల్, కమర్షియల్) విషయానికి వస్తే.. వెయ్యి చదరపు మీటర్ల లోపు నిర్మాణాలకు చదరపు మీటరకు రూ. 10 చొప్పున, వెయ్యి అంతకంటే ఎక్కువ చదరపు మీటర్ల నిర్మాణాలకు చదరపు మీటరుకు రూ. 15 చొప్పున.. గరిష్టంగా రూ.7 లక్షల వరకు చెల్లించాలి.
  • కమర్షియల్ ప్రాజెక్టుల విషయానికి వస్తే.. వెయ్యి చదరపు మీటర్ల లోపు నిర్మాణాలకు చదరపు మీటరకు రూ.20 చొప్పున, వెయ్యి అంతకంటే ఎక్కువ చదరపు మీటర్ల నిర్మాణాలకు చదరపు మీటరుకు రూ. 25 చొప్పున.. గరిష్టంగా రూ. 10 లక్షల వరకు చెల్లించాలి.
  • ప్లాటెడ్ డెవలప్ మెంట్ అయితే చదరపు మీటరుకు రూ.5 చొప్పున గరిష్టంగా రూ.2 లక్షలు కట్టాలి.
  • రెరా చట్టం సెక్షన్ 4, సబ్ సెక్షన్ (2) క్లాజ్ (1) కింద ఫారమ్ బి లో డిక్లరేషన్ సమర్పించాలి.

This website uses cookies.