ఆన్ గోయింగ్ ప్రాజెక్టు అంటే.. ఇంకా పనులు జరుగుతున్న ప్రాజెక్టు అని అర్థం. దానికి ఆక్యుపెన్సీ లేదా కంప్లీషన్ సర్టిఫికెట్ జారీ కాలేదని తెలుసుకోవాలి. అయితే, 2017 జనవరి ఒకటో తేదీ కంటే ముందు యూడీఏలు, డీటీసీపీ, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, టీఎస్ఐఐసీ అనుమతించిన ప్రాజెక్టులకు మినహాయింపు వర్తిస్తుంది.
ఆన్ గోయింగ్ ప్రాజెక్టులకు సంబంధించి ప్రమోటర్లు వెల్లడించాల్సిన అంశాలు..
కంప్లీషన్ సర్టిఫికెట్ పొందని ప్రాజెక్టు ప్రమోటర్.. నిర్దేశిత సమయంలోగా నిబంధన 3లో పేర్కొన్న విధంగా రెరాకు దరఖాస్తు చేయాలి.
మంజూరైన్ ప్లాన్, లేఔట్ ప్లాన్, స్పెషికేషన్లలో ఏవైనా తదుపరి మార్పులు జరిగాయా అనే విషయం తెలియజేయాలి. అలాగే కేటాయించినవారి నుంచి సేకరించిన మొత్తం డబ్బు, ప్రాజెక్టు అభివృద్ధి కోసం వెచ్చించిన మొత్తం, ప్రమోటర్ వద్ద ఉన్న బ్యాలెన్స్ అమౌంట్ వివరాలు వెల్లడించాలి.
ప్రాజెక్టు స్థితి ఏమిటి? అంటే ఇప్పటివరకు జరిగిన పనులు ఏమిటి? ఇంకా ఏమి చేయాలనే వివరాలు చెప్పాలి. ప్రాజెక్టు పూర్తి కావడానికి కేటాయింపుదారులకు హామీ ఇచ్చిన తేదీతోపాటు ఆలస్యమైతే అందుకు కారణాలు ఉండాలి. ఇప్పటివరకు పూర్తయిన పనులు, ఇంకా పెండింగ్ లో ఉన్న పనులేమిటి అనే అంశాలు ఇంజనీర్, ఆర్కిటెక్ట్, చార్డర్డ్ అకౌంట్ ధ్రువీకరించాలి.
కార్పెట్ ఏరియా ఆధారంగా అపార్ట్ మెంట్ పరిమాణాన్ని వెల్లడించాలి. ఇంతకుముందు సూపర్ ఏరియా, సూపర్ బిల్టప్ ఏరియా వంటి ఇతర ప్రాతిపదికన విక్రయించినప్పటికీ, ఆ ప్రాంతం, నిర్మించిన ప్రాంతం మొదలైనవి ప్రమోటర్, కేటాయింపుదారు మధ్య జరిగిన ఒప్పందాన్ని ప్రభావితం చేయవు.
ప్లాటెడ్ డెవలప్ మెంట్ విషయంలో లేఔట్ ప్లాన్ ప్రకారం ఎంత ప్రాంతాన్ని విక్రయించారో తెలియజేయాలి.