- రెండో త్రైమాసికంలో రూ.5600 కోట్లు
భారత రియల్ ఎస్టేట్ మార్కెట్ లోకి ప్రైవేటు ఈక్విటీ పెట్టుబడులు వెల్లువెత్తాయి. 2022 రెండో త్రైమాసికంలో దాదాపు రూ.5600 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఈ విషయాన్ని ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టింగ్ సంస్థ సావిల్స్ ఇండియా వెల్లడించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నపరిణామాల నేపథ్యంలో చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం.. ద్రవ్యోల్బణం పెరగడం వంటి పరిణామాలు నెలకొన్నా భారత రియల్ ఎస్టేట్ మార్కెట్ లోకి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది.
నిర్మాణపరమైన కార్యకలాపాల్లోకి పెట్టుబడులు రాకున్నా.. ఆఫీసు లీజింగ్ వంటి వ్యవహారాల్లో ప్రైవేటు ఈక్విటీ పెట్టుబడుల లావాదేవీలు జరిగాయి. భారత రియల్ ఎస్టేట్ లోకి 2017లో 7.7 బిలయన్ డాలర్ల పెట్టుబడులు రాగా.. 2018లో 6 బిలియన్ డాలర్లు, 2019లో 6.7 బిలియన్ డాలర్లు, 2020లో 6.6 బిలియన్ డాలర్లు, 2021లో 3.4 బిలియన్ డాలర్లు వచ్చాయి. కాగా, ఏ ఏడాది తొలి త్రైమాసికంలో ఒక బిలియన్ డాలర్లు రాగా, రెండో త్రైమాసికంలో 704 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.5600 కోట్లు) వచ్చినట్టు సాల్విస్ ఇండియా పేర్కొంది.