Categories: LATEST UPDATES

అందుబాటు నుంచి ఖరీదైన దిశగా..

  • కాస్ట్ లీ సిటీగా హైదరాబాద్
  • ముంబై తర్వాత ఇక్కడ ఇళ్ల ధరలే అధికం

అందుబాటు గృహాలకు నిదర్శనంగా నిలిచిన మన హైదరాబాద్ క్రమంగా కాస్ట్ లీ సిటీగా మారుతోంది. దేశంలోని ఏ మెట్రో నగరంతో పోల్చినా మన నగరంలో అందుబాటు ఇళ్లు లభ్యమయ్యేవి. కానీ ఇప్పుడా పరిస్థితి మారింది. హౌసింగ్ ప్రాపర్టీలో ముంబై తర్వాత అత్యంత ఖరీదైన నగరంగా హైదరాబాద్ నిలిచింది. వార్షిక ప్రాతిపదికన హైదరాబాద్ లో ప్రాపర్టీల విలువ 6 శాతం వృద్ధి చెందినట్టు ఓ తాజా అధ్యయనం వెల్లడించింది. ఇప్పటివరకు చదరపు గజం సగటు ధర రూ.5800 ఉండగా.. అది రూ.6వేలకు పెరిగినట్టు తెలిపింది.

దేశంలోని 8 ప్రధాన నగరాలను పరిశీలిస్తే.. ఇళ్ల విక్రయాలలో హైదరాబాద్ లో తిరుగులేని వృద్ధి నమోదవుతోంది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఇళ్లకు బాగా డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఇళ్ల ధరలు పెరుగుతున్నా డిమాండ్ మాత్రం తగ్గడంలేదు. ఇదే అదనుగా డెవలపర్లు మరింతగా రేట్లు పెంచేస్తున్నారు. కాగా, దాదాపు పదేళ్ల కాలంలో ఇంకా తక్కువగానే గృహ రుణ వడ్డీ రేట్లు ఉండటం.. కొన్ని రాష్ట్రాలు స్టాంపు డ్యూటీలు తగ్గించడం.. ఇతరత్రా ప్రోత్సాహకాలు అందించడం వంటి అంశాల నేపథ్యంలో అందుబాటు ధరలోని ఇళ్ల విక్రయాల్లో దేశవ్యాప్తంగా అత్యధిక వృద్ధి నమోదైనట్టు నివేదిక పేర్కొంది.

This website uses cookies.