Categories: LATEST UPDATES

మరో సిలికాన్ వ్యాలీగా హైదరాబాద్

ఏఎన్ఎస్ఆర్ ఎండీ విక్రమ్ అహుజా

బెంగళూరు తర్వాత మరో సిలికాన్ వ్యాలీగా హైదరాబాద్ అవతరించనుందని ఏఎన్ఎస్ఆర్ ఎండీ విక్రమ్ అహుజా అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం నుంచి మంచి సహకారం లభిస్తుండటంతోపాటు హైదరాబాద్ లో తమ సెంటర్లను ఏర్పాటు చేయడానికి ఎంఎన్ సీలకు అత్యుత్తమ సాంకేతిక నైపుణ్యాల లభ్యత ఉండటం ఇందుకు కారణమని పేర్కొన్నారు. సాంకేతిక ప్రతిభకు భారత్ లో కొదువ లేదని, ప్రస్తుతం దేశంలో దాదాపు 54 లక్షల మంది టెక్ వర్క్ ఫోర్స్ ఉందని వివరించారు. అంతేకాకుండా 2023 ఆర్థిక సంవత్సరంలో టెక్నాలజీలో 2.9 లక్షల కొత్త ఉద్యోగాల కల్పన జరిగిందన్నారు. 36 శాతం డిజిటల్ నైపుణ్యం కలిగిన వర్క్ ఫోర్స్ తో ఏఐ నైపుణ్యాలపరంగా దేశం అగ్రస్థానంలో ఉందని చెప్పారు. ఈ విషయంలో ప్రపంచంలో మార్కెట్ లీడర్ గా ఉన్న అమెరికాను సైతం అధిగమించామని పేర్కొన్నారు. ఏఐ, ఎంఎల్, బిగ్ డేటా అనలిటికల్ టాలెంట్ పూల్ లో రెండో స్థానంలో ఉన్నామని తెలిపారు. గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ల (జీసీసీ) రంగంలో ప్రస్తుతం 14 లక్షల మందికి పైగా ఉద్యోగులు ఉన్నారని వివరించారు. ఇది 2025 నాటికి 30 లక్షలు దాటే అవకాశం ఉందన్నారు. జీసీసీలో డిమాండ్ గత మూడేళ్లలో 12 నుంచి 15 శాతం పెరిగిందని.. ఇది ఐటీ సేవల సంస్థల కంటే రెట్టింపు అని అహుజా వివరించారు. టెక్ ఉద్యోగార్థుల విషయంలో బెంగళూరుకు సాటిగా హైదరాబాద్ నిలిచిందని.. పలు టెక్ దిగ్గజాలు తెలంగాణలో విస్తరిస్తుండటంతో బెంగళూరు తర్వాత తదుపరి సిలికాన్ వ్యాలీగా హైదరాబాద్ ఆవిర్భవించనుందని అహుజా అభిప్రాయపడ్డారు.

This website uses cookies.