స్థలం అమ్ముతామని చెప్పి ఓ ఎన్నారైని హైదరాబాద్ కు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ నిలువునా మోసం చేసింది. ప్రముఖ టాలీవుడ్ హీరో బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న ఆ సంస్థ చేసిన మోసానికి నైజీరియాకు చెందిన ఆ ఎన్నారై ఏకంగా రూ.3.6 కోట్లు పోగొట్టుకున్నాడు. భూమి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని చెప్పి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి రావాలని చెప్పి మొహం చాటేయడంతో తాను మోసపోయానని గుర్తించి సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించాడు.
నైజీరియలో ఉంటున్న ఎన్నారై 2021లో హైదరాబాద్ వచ్చినప్పుడు భూమి కొనుగోలు కోసం ప్రయత్నాలు చేశారు. ఓ హీరో బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న కంపెనీ ప్రకటనలు చూసి వారిని సంప్రదించాడు. ఆ సంస్థ ప్రతినిదులు తమకు రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో చాలా ప్రాజెక్టులు ఉన్నాయని చెప్పారు. దీంతో కోకాపేటలో 2,100 చదరపు గజాల స్థలాన్ని కొనాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం రూ.3.6 కోట్లు చెల్లించారు. ఏడాదిలోగా భూమి రిజిస్ట్రేషన్ చేయాలని ఒప్పందం చేసుకున్నారు. అనంతరం తనకు అమ్మిన ప్లాట్లు అప్పటికే ఇతరుల పేరుతో ఉన్న విషయాన్ని గుర్తించారు. దీనిపై కంపెనీ యజమానిని అడగ్గా.. వారి పేర్లతో ఉన్న సేల్ డీడ్ రద్దు చేయించి అదే స్థలం రిజిస్ట్రేషన్ చేయిస్తానని నమ్మించాడు. పెండింగ్ మొత్తం చెల్లించిన తర్వాత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేస్తానని హామీ ఇచ్చాడు. అది నమ్మని ఎన్నారై.. ఆ మొత్తాన్ని చెల్లించి కంపెనీ యజమాని చెప్పిన రోజున సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చాడు.
కానీ కంపెనీ యజమానికి ఎంతకూ రాకపోవడంతో పలుమార్లు ఫోన్ చేశాడు. అయినా స్పందన లేకపోవడంతో పోలీసులను ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ కంపెనీ యజమానిపై కేసు నమోదు చేశారు.
This website uses cookies.