Categories: LATEST UPDATES

రియల్ హబ్స్ గా టైర్-2 నగరాలు.. 5 కారణాలు

దేశంలోని టైర్-2 నగరాలు రియల్ ఎస్టేట్ హబ్స్ గా మారుతున్నాయి. ముఖ్యంగా కోవిడ్ తర్వాత చాలా కంపెనీలు తమ ప్ర్రాంతీయ శాటిలైట్ కార్యాలయాలను తమ ఉద్యోగులకు అనుకూలంగా, దగ్గరగా ఉండేలా చేసేందుకు టైర్-2 నగరాల వైపు మొగ్గు చూపిస్తున్నాయి. అహ్మదాబాద్, ఇండోర్, జైపూర్, కొచ్చి, భువనేశ్వర్, చండీగఢ్, లక్నో వంటి నగరాలు ఇందులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇవి రియల్ హబ్స్ గా మారడానికి ప్రధానంగా 5 కారణాలు కనిపిస్తున్నాయి. వాటిలో టైర్-2 నగరాల్లో మౌలిక వసతులు అభివృద్ధి చెందడంతోపాటు కనెక్టివిటీ బాగా మెరుగుకావడం మొదటి అంశం.

తక్కువ ధరకే భూములు లభించడం.. అందుబాటు అద్దెలకే ఇళ్లు, ఆఫీసులు దొరకడం రెండో కారణం. రియల్ ఎస్టేట్ పరిశ్రమ నివేదిక ప్రకారం… ప్రధాన నగరాల్లోని రేట్లతో పోలిస్తే టైర్-2 నగరాల్లో అద్దెలు దాదాపు సగమే. నైపుణ్యం కలిగిన ఉద్యోగులు అందుబాటులో ఉండటం మూడో కారణం. కరోనా తర్వాత చాలామంది ఉద్యోగులు తమ కుటుంబాలకు దగ్గరగా ఉండాలని భావిస్తున్నారు. దీంతో కంపెనీలు సైతం తమ ఉద్యోగులను కాపాడుకోవడానికి వర్క్ ఫ్రం హోమ్, హైబ్రిడ్ మోడల్స్ అమలు చేస్తూ.. ఉద్యోగుల ఊళ్లకు దగ్గరగా టైర్-2 నగరాల్లో ప్రాంతీయ కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నాయి. టైర్-2 నగరాల్లో పెట్టుబడులు పెడితే చక్కని లాభాలు వస్తాయనే విశ్లేషణ నాలుగో కారణం.

అభివృద్ధి చెందుతున్న మౌలిక వసతులు, అందుబాటు ధరలో ఇళ్లు లభించడం వంటివి మరో అంశం. ఈ నేపథ్యంలోనే అయోధ్య, ఇండోర్, కొచ్చి సహా 13 టైర్-2 నగరాలు రియల్ ఎస్టేట్ హాట్ స్పాట్స్ గా మారుతున్నాయి.

This website uses cookies.