Categories: LATEST UPDATES

మరో ఆరు అక్రమ నిర్మాణాలపై వేటు

మంగళవారం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఎ) పరిధిలోని రెండు మున్సిపాలిటీలలో డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్, హెచ్ఎండీఏ అధికారులు ఆరు(6) అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకున్నారు.

గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో మూడు అక్రమ నిర్మాణాల పైన, తుర్క యంజాల్ మున్సిపాలిటీ పరిధిలో మరో మూడు అక్రమ నిర్మాణాలపై అధికారులు చర్యలు తీసుకున్నారు.ఇప్పటివరకు 208 అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. అక్రమ నిర్మాణాల గుర్తింపు వాటిపై చర్యలు నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని స్పష్టం చేశారు.

This website uses cookies.