* బహదూర్ పల్లిలో 101 ప్లాట్లు, తొర్రూర్ లో 223 ప్లాట్లు
* నేడు బహదూర్ పల్లి ప్రీ బిడ్ సమావేశం
* 25న తొర్రూర్ ప్రీబిడ్ సమావేశం
* మార్చి మూడో వారంలో ఈ –ఆక్షన్ షురూ
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు బహదూర్ పల్లి(మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా), తొర్రూరు(రంగారెడ్డి జిల్లా) లోని ప్లాట్లను ఆన్ లైన్ ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎంఎస్టిసి ఆధ్వర్యంలో వేలం(ఈ –ఆక్షన్) ద్వారా విక్రయించేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ(హెచ్ఎండిఏ) సన్నాహాలు పూర్తి చేసింది. మల్టీ పర్పస్ జోన్ కింద ఉన్న ఈ రెండు లే అవుట్లను హెచ్ఎండిఏ పూర్తిస్థాయిలో అభివృద్ది చేయనున్నది. బహదూర్ పల్లిలో 101 ప్లాట్లు, తొర్రూర్ లో 223 పాట్ల ను ఈ–ఆక్షన్ ద్వారా మార్చి మూడో వారంలో విక్రయిస్తున్న సంగతి తెలిసిందే.
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా పరిధిలోని బహదూర్ పల్లిలో 40 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేస్తున్న లే అవుట్ లో 101 పాట్ల విక్రయాలకు సంబంధించి బుధవారం(23వ తేదీ) నాడు ప్రీబిడ్ మీటింగ్ జరుగనున్నది. బహదూర్ పల్లిలో మేకల వెంకటేశ్ ఫంక్షన్ హాల్ లో బుధవారం ఉదయం పదకొండు గంటలకు ప్రీబిడ్ మీటింగ్ ప్రారంభం కానున్నది.
రంగారెడ్డి జిల్లాలోని తొర్రూర్ లో 117 ఎకరాల విస్తీర్ణంలో హెచ్ఎండిఏ లేఅవుట్‌ను అభివృద్ధి చేస్తుంది. అందులోని 223 ప్లాట్లను ఈ ఆక్షన్ ద్వారా విక్రయించనున్నారు. దీనికి సంబంధించి ప్రీబిడ్ మీటింగ్‌ను ఈనెల 25వ తేదీన తోర్రూర్ సైట్ లోనే నిర్వహించనున్నారు.
This website uses cookies.