హైదరాబాద్ నిర్మాణ రంగంలోనే ప్రప్రథమంగా స్కై వాక్ ప్రాజెక్టు ఆరంభమైంది. దీనికి హై నైన్ అని అన్వితా గ్రూప్ పేరు పెట్టింది. తెల్లాపూర్ ఎంఎంటీఎస్ స్టేషన్ చేరువలో.. కొల్లూరు ఓఆర్ఆర్ సెకండ్ ఎగ్జిట్ పక్కనే.. మొదలైన ఈ ప్రాజెక్టును సుమారు పదిహేను ఎకరాల్లో డెవలప్ చేస్తోంది. 30 అంతస్తుల ఎత్తులో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు పైభాగంలో.. వాకింగ్ ట్రాక్‌ను డిజైన్ చేశారు. అంతేకాదు.. ఇందులో వచ్చే మొత్తం తొమ్మిది టవర్లను కలుపుతూ ప్రత్యేకంగా కనెక్టింగ్ బ్రిడ్జీలను ఏర్పాటు చేస్తారు. అసలు హైదరాబాద్‌లో ఇలా ఒక ఆకాశహర్మ్యాన్ని కలుపుతూ.. స్కై వాక్‌లను ఏర్పాటు చేయడం ఇదే ప్రప్రథమం అని అన్వితా గ్రూప్ ఘంటాపథంగా చెబుతోంది.
టూ, త్రీ బీహెచ్‌కే లైఫ్‌స్టయిల్ అపార్టుమెంట్స్‌తో పాటు 29, 30వ అంతస్తుల్లో ఫోర్ బీహెచ్‌కే స్కై విల్లాలను డిజైన్ చేసింది. 15 ఎకరాల్లో వచ్చే తొమ్మిది టవర్లతో పాటు స్పోర్ట్స్ కాంప్లెక్స్ గల రెండు ఎమినిటీస్ బ్లాకులను అదనంగా ఏర్పాటు చేసింది. ఎనభై శాతం కంటే అధిక ఓపెన్ స్పేస్ గల ఈ ప్రాజెక్టులో ప్రతి టవర్‌కు ఎంట్రెన్స్ లాంజ్‌లను ఏర్పాటు చేసింది. మరో ఆకర్షణ ఏమిటంటే.. పోడియంలో ఎక్కడా ట్రాఫిక్ అనేదే ఈ హై నైన్‌లో కనిపించదు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారి కోసం ప్రత్యేకంగా ఆఫీస్ స్పేసెస్ కోసం విడిగా స్థానం కల్పించింది.
This website uses cookies.