హైదరాబాద్ కు చెందిన మై హోమ్ గ్రూప్, అపర్ణా కన్ స్ట్రక్షన్స్, రాంకీ ఇన్ ఫ్ట్రాస్ట్రక్చర్ వంటి సంస్థలు టాప్ రియాల్టీ బ్రాండ్లుగా అవతరించాయి. ఈ సంస్థకు చెందిన అధిపతులు టాప్ లీడర్లుగా ఖ్యాతినార్జించారు. ఏసియా వన్ అనే అంతర్జాతీయ మీడియా సంస్థ తాజాగా నిర్వహించిన రియల్ ఎస్టేట్ సర్వే ద్వారా ఈ ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించింది. భారత జీడీపీకి వ్యవసాయం తర్వాత అధిక ఆదాయం లభించేది నిర్మాణ రంగం ద్వారానే. అందుకే, ఈ సంస్థ 2020-21లో టాప్ ఫిఫ్టీ బ్రాండ్ల జాబితాను సిద్ధం చేసింది. దీని ప్రకారం Hyderabad Real Estate ..
నెం. | పేరు | సంస్థ | హోదా | మొత్తం విలువ |
---|---|---|---|---|
1 | రామేశ్వర్ రావు జూపల్లి | మైహోమ్ గ్రూప్ | ఛైర్మన్ | 7300 కోట్లు |
2 | ఎస్ ఎస్ రెడ్డి | అపర్ణా కన్ స్ట్రక్షన్స్ | సీఎండీ | 5200 కోట్లు |
3 | సీవీ రెడ్డి | అపర్ణా కన్ స్ట్రక్షన్స్ | డైరెక్టర్ | 4350 కోట్లు |
4 | ఆళ్ల అయోధ్యరామిరెడ్డి | రాంకీ ఇన్ఫ్రా | ఛైర్మన్ | 2675 కోట్లు |
5 | మనోజ్ నంబూరు | అలయాన్స్ | గ్రూప్ సీఎండీ | 2175 కోట్లు |
6 | సునీల్ బొమ్మిరెడ్డి | అలయాన్స్ | గ్రూప్ వీసీ | 2150 కోట్లు |
* పైన పేర్కొన్న మొదటి నలుగురు వ్యక్తులు హైదరాబాద్ నిర్మాణ రంగంతో దాదాపు ముప్పయ్యేళ్ల అనుబంధం ఉంది. ఈ రంగమే ఆధారంగా అనేక విలువైన ప్రాజెక్టుల్ని నిర్మించారు. రెసిడెన్షియల్ అపార్టుమెంట్లు, లగ్జరీ విల్లాలు, వాణిజ్య సముదాయాల్ని నిర్మించి.. నగర నిర్మాణ రంగం బ్రాండ్ విలువను పెంచారు.
* అలయాన్స్ గ్రూపు మాత్రం హైదరాబాద్లో ఇటీవల కాలంలో రెండు ప్రాజెక్టుల్ని ప్రకటించిందే తప్ప.. ఈ సంస్థకు భాగ్యనగరానికి పెద్ద సంబంధం ఏమీ లేదు. చెన్నైకి చెందిన అలయాన్స్ గ్రూపు.. హైదరాబాద్ మియాపూర్లో యూడీఎస్ విధానంలో ఫ్లాట్లను అమ్మిన సంస్థగా గుర్తింపు పొందింది. కొనుగోలుదారులతో హండ్రెడ్ పర్సంట్ పేమెంట్ చేసే రియల్ ఏజెంట్లను ఈ సంస్థ ప్రత్యేకంగా ప్రోత్సహించింది.
This website uses cookies.