Categories: TOP STORIES

యూడీఎస్ సంస్థలకు రెరా నోటీసులు!

మార్కెట్ రేటు కంటే ఫ్లాటు తక్కువకు వస్తుందని.. ఏదైనా ప్రాజెక్టులో ఫ్లాటు కానీ ఆఫీసు స్పేస్ కానీ కొనేందుకు ప్రయత్నిస్తున్నారా? అయితే, వెంటనే మీ ప్రయత్నాన్ని మానుకోవాల్సిందే. ఎందుకంటే, రిజిస్ట్రేషన్ శాఖ అన్ డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ ను రిజిస్టర్ చేయడం లేదు.

కొందరు బిల్డర్లు, డెవలపర్లు, ప్రమోటర్లు స్థానిక సంస్థల నుంచి అనుమతి తీసుకోకుండానే.. తక్కువ రేటుకే ఫ్లాటు అంటూ మభ్యపెడుతూ.. అమాయక కొనుగోలుదారుల నుంచి సొమ్ము లాగుతున్నారు. ఇలా కొందరు ఫ్లాట్లు అమ్ముతుంటే, మరికొందరు వాణిజ్య స్థలాన్ని విక్రయిస్తున్నారు. ఇలాంటి సంస్థల్లో అధిక శాతం ఆయా సొమ్మును సంబంధిత ప్రాజెక్టు నిమిత్తం వినియోగించడం లేదని ప్రభుత్వం ద్రుష్టికొచ్చింది. ఒకవేళ, ఆయా ప్రాజెక్టు పనులు ఆరంభం కాకపోయినా, ఆలస్యమైనా కొనుగోలుదారులు తీవ్రంగా ఇబ్బంది పడే ప్రమాదముంది. అందుకే, సంబంధిత స్థానిక సంస్థ ఆమోదం పొందిన తర్వాత, స్టాంప్ డ్యూటీ చెల్లించాక చేసుకునే అగ్రిమెంట్ ఆఫ్ సేల్/ కన్ స్ట్రక్షన్ అగ్రిమెంట్ / డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఉంటేనే యూడీఎస్ స్థలాన్ని రిజిస్టర్ చేస్తుంది. ఈ మేరకు రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ మరియు ఐజీ ప్రత్యేక సర్కులర్ జారీ చేశారు. కాబట్టి, ఎవరైనా సేల్ అగ్రిమెంట్ చేసుకోకుండానే.. సబ్ రిజిస్ట్రార్లను మేనేజ్ చేసి.. యూడీఎస్ కింద డెబ్బయ్, ఎనభై గజాల్ని రిజిస్టర్ చేస్తామంటే నమ్మకండి.
యూడీఎస్ రిజిస్ట్రేషన్లు చేయకూడదనే జీవో 1997లోనే ఉన్నదని చెప్పే డెవలపర్లు లేకపోలేరు. యూడీఎస్ అమ్మకాల్ని చేసేవారిని కఠినంగా శిక్షించాలని అంటున్నారు. కంటితుడుపు చర్యల్ని తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉండదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తెలంగాణ రెరా అథారిటీ కూడా అక్రమ పద్దతిలో ఫ్లాట్లను విక్రయించే బిల్డర్లకు నోటీసుల్ని జారీ చేస్తుంది. ఇప్పటికే పలు సంస్థలకు నోటీసులిచ్చింది. జరిమానా విధించే ప్రక్రియను ముమ్మరం చేసింది.

This website uses cookies.