poulomi avante poulomi avante

ఒక శాఖ అనుమ‌తి.. ఇంకో శాఖ కూల్చివేత‌

మామిడాకుల తోర‌ణం ఆర‌క‌ముందే
ఇల్లు కూల్చివేత అంటూ ఏడుపు..

90 ల‌క్ష‌ల రుణం.. ఇల్లు కూల్చివేశారు..
రుణ‌మెట్లా తీరేది? మ‌ళ్లీ ఇల్లు కొనేదెలా?

హైడ్రాపై మండిప‌డుతున్న సామాన్యులు

హైదరాబాద్ నగరాన్ని హైడ్రా హడలెత్తిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసి నిర్మించిన అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు నేలమట్టం చేస్తున్నారు. నిర్దాక్షిణ్యంగా ఇప్పటికే వందల కట్టడాలను నేలమట్టం చేశారు. అయితే ఈ హైడ్రా కూల్చివేతలు వివాదాస్పదం అవుతున్నాయి. పెద్దలను వదిలేసి పేద, మధ్యతరగతి ప్రజల పొట్ట కొడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. బడాబాబుల సంగతేంటో కానీ హైడ్రా కూల్చేవేతలతో సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు రోడ్డున పడుతున్నారు. పైసా పైసా కూడబెట్టుకొని నిర్మించిన కలల సౌధాలు క్షణాల్లోనే నేలమట్టం అవుతుండటంతో వారి బాధ వర్ణాణాతీతమని చెప్పాలి.

ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు తీసుకున్నా.. కొందరు బిల్డర్లు, బడాబాబులు చేసిన మోసానికి తాము బలై పోయామంటూ కన్నీరు పెట్టుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం సైతం పెద్దలను వదిలేసి తమలాంటి పేదల ఇండ్లను కూల్చేస్తోందని సామాన్యులు మండిపడుతున్నారు. హైదరాబాద్ నగరంలో హైడ్రా కూల్చివేతల్లో ఇల్లు కోల్పోయిన ఓ చిన్నారి మాటలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తన తల్లిదండ్రులు ఏడుస్తున్నా వినకుండా రేవంత్ సార్ తమ ఇంటిని కూల్చేశాడని చిన్నారి వాపోయింది. తన స్కూల్ బుక్స్, వాటర్ బాటిల్స్ అందులోనే ఉండిపోయాయని చెప్పగా.. చిన్నారి మాటలు అందరిచే కంటతడి పెట్టిస్తున్నాయి.

హైడ్రా కూల్చివేతల నేపధ్యంలో సామాన్యులది ఒక్కొక్కరిది ఒక్కో కన్నీటి గాధ ఎన్ని చెప్పవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకున్న మూడు రోజులకే ఇంటిని కూల్చేశారంటూ ఓ కుటుంబం బోరున విలపిస్తుంటే.. తన కష్టాన్నంతా దారపోసి మూడేళ్లు నిర్మించిన ఇల్లు క్షణాల్లో నేలమట్టం అయిందని మరో బాధితుడు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఇలా ఒక్కో బాధితుడిది ఒక్కో విషాదగాథ. ఇళ్లు కోల్పోయిన బాధితుల గోడు వింటుంటే ఎవ్వ‌రికైనా.. అయ్యో పాపం అనిపించక మానదు. పెద్దల నిర్మాణాలకు నోటీసులు ఇచ్చి.. పేదల ఇళ్లకు మాత్రం ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, కనీసం ఇంట్లోని సామాన్లు కూడా తీసుకోవటానికి సమయం లేకుండా ఉన్నపళంగా కూల్చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇళ్లు కోల్పోయిన బాధితుల కథ వింటే గుండె తరుక్కుపోతోంది. ఒక్కొక్కరిది ఒక్కో గాథ. గృహ ప్రవేశం చేసి మామిడాకుల తోరణాలు ఆరక ముందే ఇంటిని కూల్చేశారని మరో బాధితుడు భావోద్వేగానికి గురయ్యాడు. అన్ని కరెక్ట్ గా ఉన్నా ఎందుకు కూల్చారని ఇల్లు కోల్పోయినవారు ప్రశ్నిస్తున్నారు. అనుమతులు ఇచ్చి, ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేసి, మళ్లీ ప్రభుత్వమే కూల్చేస్తే మేమెవ్వరికి చెప్పుకోవాలని వాపోతున్నారు బాధితులు.

గత మూడేళ్లుగా కష్టపడి ఇల్లు కొనుక్కున్నామని హైడ్రా కూల్చివేతల్లో ఇల్లు కోల్పోయిన ఓ బాధితుడు ఆవేద‌న వ్యక్తం చేశాడు. ఆ ఇంటిపైన ఇంకా 80 లక్షల అప్పుందని.. ఇప్పుడు ఇల్లు కూల్చేస్తే ఆ అప్పును ఎలా తీర్చాలని ప్రశ్నిస్తున్నాడు. గ్రామ పంచాయితీ నుంచి అనుమతి తీసుకుని, బ్యాంకు లోన్ కూడా తీసుకుని.. కలల ఇంటిని నిర్మించుకుని గత సోమవారమే గృహ ప్రవేశం చేస్తే.. ఇప్పుడు హైడ్రా వచ్చేసి ఇల్లు కూల్చేస్తే తామెవ్వరికి చెప్పాలని బోరున విలపిస్తున్నారు. హైదరాబాద్‌లో ఇల్లు ఉండాలని పిచ్చి టార్గెట్‌ తో 90 లక్షలు లోన్ తీసుకొని ఇల్లు కొనుక్కుమని మరో బాధితుడు చెప్పుకొచ్చాడు.

తనకు ఇప్పుడు 52 ఏళ్ల వయసని, తన సంపాదనంతా ఇంటికోసమే ఖర్చు చేయానని.. హాఠాత్తుగా హైడ్రా ఇల్లు కూల్చడంతో ఏ దారీ కనిపించడం లేదని వాపోతున్నాడు. ఇలా వందల మంది బాధితులు సర్వం కోల్పోయి ఆవేద‌న వ్యక్తం చేస్తున్నారు. మరి ఇల్లు కోల్పోతున్న సామాన్యులకు రేవంత్ సర్కార్ ఎలాంటి భరోసా కల్పిస్తుంది, ఏవిధంగా సాయం చేస్తుందన్నదే ఇప్పుడు అందరిలో మెదులుతున్న ప్రశ్నలు.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles