ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ కోసం ఈవీ చార్జింగ్ స్టేషన్లు లేని భవనాలకు అనుమతి ఇవ్వకూడదని నోయిడా మున్సిపల్ అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం బిల్డింగ్ మాన్యువల్-2010లో సవరణలు కూడా చేశారు. పార్కింగ్ ఏరియాలో కనీసం 20 శాతం ప్రదేశంలో ఈవీ స్టేషన్లు ఉండాలని షరతు విధించారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది. ఇకపై ప్రతి రెసిడెన్షియల్, కమర్షియల్, ఇండస్ట్రియల్ ప్రాజెక్టుల్లో ఈవీ స్టేషన్ ఏర్పాటు తప్పనిసరి కానుంది.
నోయిడాలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం నగరంలో 99 కార్లు, 1600 బైకులు మాత్రమే ఎలక్ట్రిక్ వి ఉన్నాయి. అలాగే నగరవ్యాప్తంగా 54 ఈవీ స్టేషన్లు ఉండగా.. కొత్తగా మరో 93 రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో వీటి వినియోగాన్ని పెంచడానికి నోయిడా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. పారిస్ వాతావరణ ఒప్పందం ప్రకారం 2030 నాటికి దేశంలో 33 నుంచి 35 శాతం మేర కర్బన ఉద్గారాలను తగ్గించాల్సి ఉంది. ఇందుకోసం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించారు.
This website uses cookies.