Categories: TOP STORIES

ఐజీబీసీ గ్రీన్ క్రూసేడర్లు

  • 22లోగా మీ ప్రాజెక్టును రిజిస్టర్ చేసుకోండి
  • డెవలపర్లు, కార్పొరేట్ ప్రాజెక్టు యజమానులకు ఐజీబీసీ పిలుపు

‘మన గ్రహంలో పెట్టుబడి పెట్టండి’ అనే థీమ్ తో భారతదేశం ఈనెల 22న ప్రపంచ ఎర్త్ డే జరుపుకొంటున్న సందర్భంగా ఈ మహా క్రతువులూ మీరూ భాగస్వాములు కావాలని ఐజీబీసీ కోరుతోంది. మానవాళికి అతిపెద్ద ముప్పుగా పరిణమించిన వాతావరణ మార్పులను కలసికట్టుగా ఎదుర్కోవడానికి గ్రీన్ బిల్డింగ్ ఉద్యమాన్ని వేగవంతం చేయాలని పిలుపునిచ్చింది.

వరల్డ్ ఎర్త్ డే నేపథ్యంలో ఐజీబీసీ గ్రీన్ క్రూసేడర్స్ కార్యక్రమం కింద ప్రాజెక్టు రిజిస్ట్రేషన్ డ్రైవ్ ని నిర్వహిస్తున్నట్టు పేర్కొంది. ఈ అద్భుతమైన కార్యక్రమంలో భాగస్వాములు కావాలని డెవలపర్లు, కార్పొరేట్ ప్రాజెక్టు యజమానులను ఆహ్వానిస్తోంది. ఏప్రిల్ 22 లోపు లో 31 హోలిస్టిక్ ఐజీబీసీ గ్రీన్ బిల్డింగ్ రేటింగ్ సిస్టమ్ లో మీ వాణిజ్య లేదా నివాస ప్రాజెక్టును నమోదు చేయడం ద్వారా ఈ గొప్ప కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఐజీబీసీ సూచిస్తోంది. రూ.35,400 రిజిస్ట్రేషన్ ఫీజుతోపాటు ప్రాజెక్టు పేరు, చిరునామా, బిల్డప్ ఏరియా, ప్రాజెక్టు కో ఆర్డినేటర్ల వివరాలను ఆన్ లైన్ లో పూర్తిచేయాలని పేర్కొంది. ఈ డ్రైవ్ లో పాల్గొనేవారికి ఐజీబీసీ గ్రీన్ క్రూసేడర్లు అని పేరు పెట్టారు. అలా పాల్గొన్నవారందరినీ ఏప్రిల్ 22న హైటెక్ సిటీలోని సీఐఐ సోరాబ్జీ గోద్రేజ్ గ్రీన్ బిజినెస్ సెంటర్లో సత్కరిస్తారు. సహాయం లేదా మరిన్ని వివరాలకు 9000999689 నెంబర్లో సందీప్ ను సంప్రదించాలని ఐజీబీసీ చైర్మన్ సి.శేఖర్ రెడ్డి సూచించారు.

This website uses cookies.