Categories: TOP STORIES

నాలుగేళ్లలో రూ.1.3 లక్షల కోట్లు

  • రీట్స్, ఇన్విట్స్ తో వచ్చిన మొత్తమిది
  • ఆర్ బీఐ గణాంకాల్లో వెల్లడి

రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఉపకరించే రీట్స్, ఇన్విట్స్ ద్వారా గత నాలుగేళ్లలో ఏకంగా రూ.1.3 లక్షల కోట్లు వచ్చాయి. గత నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో ఈ మొత్తం వచ్చినట్టు ఆర్ బీఐ గణాంకాలు వెల్లడించాయి. భవిష్యత్తులో కూడా ఈ జోరు కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు.

భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా అభివృద్ధి పథం వైపు పయనిస్తుండటంతో పెట్టుబడులకు రీట్స్, ఇన్విట్స్ ను ఎక్కువ మంది ప్రత్యామ్నాయంగా ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా అధిక నికర విలువ కలిగిన వ్యక్తులు (హెచ్ఎన్ఐలు) వీటి వైపు మొగ్గు చూపిస్తున్నారు. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ట్రస్టులు (రీట్స్), ఇన్ ఫ్రాస్టక్చర్ ఇన్వెస్ట్ మెంట్స్ ట్రస్టులు (ఇన్విట్స్) రియల్ రంగంలో పెట్టుబడులకు గమ్యస్థానంగా ఉద్భవించాయని, పెట్టుబడులకు సురక్షితంగా ఉన్నందును ఎక్కువ మంది వీటి పట్ల ఆసక్తి కనబరుస్తున్నారని ఆర్ బీఐ పేర్కొంది.

మార్చిలో పబ్లిక్ ఇస్యూ ద్వారా ఏకంగా రూ.2,500 కోట్ల మేర ఇన్విట్స్ వచ్చాయి. కనీస పెట్టుబడి మొత్తాన్ని సెబీ తగ్గించిన నేపథ్యంలో ఎక్కువమంది ఇందులో ట్రేడ్ చేస్తున్నారు. ఫలితంగా రీట్స్ ఎక్కువగా వస్తున్నాయి. ‘లాట్ సైజును తగ్గిస్తూ సెబీ తీసుకున్న నిర్ణయంతో పాటు ఇతరత్రా అంశాలు రీట్స్ ను ఆకర్షణీయమైన పెట్టుబడి సాధనంగా మార్చాయి’ అని ఇండియన్ రీట్ అసోసియేషన్ పేర్కొంది.

This website uses cookies.