విశాఖపట్నంలో ఎవరైన నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే సహించే ప్రసక్తే లేదని గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పి.రాజాబాబు హెచ్చరించారు. అలాంటి అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని స్పష్టం చేశారు. అనుమతి పొందిన భవన ప్లాన్లను ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టొద్దన్నారు. ‘ఇసుక, సిమెంట్, స్టీల్ వంటి నిర్మాణ సామగ్రతిని రోడ్లపై ఉంచొద్దు. అలా ఉంచడం వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతోంది. అలాగే కూల్చివేత వ్యర్థాలను కూడా రోడ్లపై వేయొద్దు. డంపింగ్ మెటీరియల్స్ ను రోడ్లపై వేసే వాహనాలను సీజ్ చేస్తాం. అంతేకాకుండా భారీ జరిమానా కూడా విధిస్తాం’ అని స్పష్టం చేశారు.
This website uses cookies.