Categories: TOP STORIES

భౌరంపేట్‌లో బ‌డా అక్ర‌మార్కులు!

    • రూ.28 ల‌క్ష‌ల‌కే ఫ్లాటు ఇస్తార‌ట‌
    • భౌరంపేట్‌లో చ‌ద‌ర‌పు అడుక్కీ రూ.2,499 మాత్ర‌మే..
    • రూ.28 లక్ష‌ల్నుంచి పెట్టుబ‌డి పెట్టే అవ‌కాశం..
    • ఆరు ఎక‌రాల్లో ప్రీమియం హైరైజ్ అపార్టుమెంట్‌..
    • ప‌దిహేను అంత‌స్లుల్లో.. 6 ట‌వర్లు..
    • 1123 నుంచి 2016 చ‌.అ.ల్లో ఫ్లాట్లు..
    • ఓఆర్ఆర్ స‌ర్వీసు రోడ్డు 5వ ఎగ్జిట్ వ‌ద్ద‌..
    • పేరెన్నిక గ‌ల బిల్డ‌ర్‌.. వ‌ర‌ల్డ్ క్లాస్ ఆర్కిటెక్ట్‌..

చ‌దువుతుంటే ఎంతో ఆనంద‌మేస్తుంది క‌దూ.. అంత మంచి లొకేష‌న్‌.. హైరైజ్ ప్రాజెక్టు.. పైగా టాప్ బిల్డ‌ర్‌.. వ‌ర‌ల్డ్ క్లాస్ ఆర్కిటెక్ట్‌.. మ‌రి, ఈ ఇద్ద‌రూ టాప్ క్లాస్ వ్య‌క్తులు.. హైద‌రాబాద్‌లో నిబంధనలకు విరుద్ధంగా..  హెచ్ఎండీఏ, రెరా అనుమతుల్లేకుండా.. ప్రజల నుంచి అక్రమంగా సొమ్ము వసూలు చేయమని చెప్పారా? ఇంత నిస్సిగ్గుగా.. ఇంత నిర్లజ్జాగా.. ఫ్లాట్లను అమ్మాల్సిన అవసరమేమిటి? నిబంధ‌న‌ల్ని పాటిస్తూ వ‌రల్డ్ క్లాస్ అమెనిటీస్‌తో నిర్మించొచ్చు క‌దా! హైద‌రాబాద్‌లో వీళ్ల‌ను ఎవ‌రైనా క‌ట్టొద్దంటున్నారా?

ఈ ప్రాజెక్టుకు సంబంధించిన స‌మాచారం రాగానే.. కొంద‌రు కొనుగోలుదారులు ఈ కంపెనీ పూర్వాప‌రాలు, గ‌త చ‌రిత్ర‌ గురించి తెలుసుకోవ‌డానికి రియ‌ల్ ఎస్టేట్ గురుని సంప్ర‌దించారు. దీంతో, రంగంలోకి దిగిన రియ‌ల్ ఎస్టేట్ గురు ప‌రిశోధిస్తే.. కేవ‌లం ఎనిమిది నెల‌ల క్రితం ఎల్ఎల్‌పీగా ఈ సంస్థ ఆరంభ‌మైంద‌ని తెలిసింది. మ‌రి, పెద్ద‌గా పేరుప్ర‌ఖ్యాత‌లు లేని ఈ సంస్థ ఎలా ఇంత పెద్ద ప్రాజెక్టును ఎలా పూర్తి చేస్తుంది? అస‌లు ఇంత‌వ‌ర‌కూ అపార్టుమెంట్ల‌ను క‌ట్టిన చ‌రిత్ర ఉందా? ఒక‌వేళ నిజంగానే వ‌ర‌ల్డ్ క్లాస్ ప్రాజెక్టును క‌ట్టాలంటే.. హెచ్ ఎండీఏ, రెరా నుంచి అనుమ‌తి తీసుకుని క‌ట్టొచ్చు క‌దా? ఎందుకిలా అక్ర‌మ ప‌ద్ధ‌తిలో ఫ్లాట్ల‌ను విక్ర‌యించాలి? హైద‌రాబాద్ కొనుగోలుదారులంటే ఇంత అమాయ‌కులుగా క‌నిపిస్తున్నారా? ఇక్క‌డి ప్ర‌భుత్వం క‌ళ్లు మూసుకుంటుంద‌ని భావిస్తున్నారా?

This website uses cookies.